త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitin Nabin | తెలంగాణ‌లో గూండారాజ్ : బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్‌

Nitin Nabin | తెలంగాణ‌లో క‌మిష‌న్‌రాజ్‌, గూండారాజ్ న‌డుస్తోంద‌ని, అవినీతి, క‌మీష‌న్ల ప్ర‌భుత్వ కూక‌టివేళ్ల‌తో పెకిలించాల‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్ పిలుపునిచ్చారు. ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా ఎన్నికైన ఆయ‌న తొలిసారిగా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు.

P

Telangana | Published On Feb 4, 2026, 7.21 pm IST

Nitin Nabin | తెలంగాణ‌లో గూండారాజ్ : బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్‌
Advertisement

Nitin Nabin | తెలంగాణ‌లో క‌మిష‌న్‌రాజ్‌, గూండారాజ్ న‌డుస్తోంద‌ని, అవినీతి, క‌మీష‌న్ల ప్ర‌భుత్వ కూక‌టివేళ్ల‌తో పెకిలించాల‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్ పిలుపునిచ్చారు. ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా ఎన్నికైన ఆయ‌న తొలిసారిగా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. బుధ‌వారం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని ఎస్‌వీఎస్ డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజ‌య సంక‌ల్ప్ స‌మ్మేళంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ అమ‌ర‌వీరుల‌కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తున్నాన‌ని, తెలంగాణ ఉద్య‌మంలో పోరాడిన వీరుల‌కు న‌మ‌స్క‌రిస్తున్నాన‌న్నారు. తెలంగాణ గ‌డ్డ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిందని పోరాడింద‌న్నారు. హైద‌రాబాద్ విముక్తి కోసం స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ కృషి చేశార‌ని గుర్తు చేశారు. ముస్లింల ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ నేత‌లు ఆరాట‌ప‌డుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

కొన్ని వ‌ర్గాల‌ను సంతృప్తి ప‌రిచేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, ఈ ప్ర‌భుత్వ పాల‌న‌లో బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ఒరిగిందేమీ లేద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వక్ఫ్ బోర్డులను మరింత బలోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల‌కు సంబంధించిన నిధుల్లో కోత విధిస్తోంద‌ని మండిప‌డ్డారు. బీసీల‌ను మోసం చేసింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు ప్ర‌భుత్వం య‌త్నిస్తుంద‌న్నారు. హిందూ ఆల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేవాల‌యాల భూముల‌ను ఆక్ర‌మిస్తున్నార‌న్నారు. స‌నాత‌న ధ‌ర్మంపై జ‌రుగుతున్న దాడిని స‌హించ‌బోమ‌ని హెచ్చ‌రించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు. రాష్ట్రంలో కమీషన్ల పేరిట ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, అభివృద్ధి పనులు, చిన్న చిన్న‌ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు సైతం ట్యాక్స్ క‌ట్టాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు.

అన్ని వ‌ర్గాల‌కు న్యాయం జ‌ర‌గాలంటే బీజేపీని గెలిపించాల‌ని కోరారు. కేంద్రం తెలంగాణ‌కు స‌ముచిత స్థాయిలోనే నిధులు ఇస్తోంద‌ని తెలిపారు. రాష్ట్రంలో రైల్వేకు రూ.5,400కోట్లు కేటాయించామ‌ని.. మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు కేటాయించింద‌ని గుర్తు చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో రెండు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం జ‌రుగుతోంద‌ని తెలిపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మోదీ ప్ర‌భుత్వానికి ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని, ఈయూతో ఒప్పందం చేసుకుని దేశాభివృద్ధికి కృషి చేస్తోంద‌న్నారు. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఉచిత బ‌స్ ప్ర‌యాణం త‌ప్ప ఒక్క హామీని నెర‌వేర్చ‌లేద‌ని ఆరోపించారు. సీఎం మాట‌లు కోట‌లు దాటుతాయ‌ని.. చేత‌లు గ‌డ‌ప‌దాట‌డం లేద‌ని సెటైర్లు వేశారు.బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు దుర‌హంకారం పెరిగింద‌న్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపీకి అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు.

Advertisement
Advertisement