త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ఎవరిచ్చారు?: హ‌రీశ్ రావు

Harish Rao | నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ఎవరు ఇచ్చారని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) ప్ర‌శ్నించారు. ఇది 30 శాతం కమిషన్ సర్కార్ అని ప్రజలే అంటున్నారని చెప్పారు.

G

Telangana | Published On Aug 22, 2026, 11.35 am IST

Harish Rao | నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ఎవరిచ్చారు?: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ఎవరు ఇచ్చారని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) ప్ర‌శ్నించారు. ఇది 30 శాతం కమిషన్ సర్కార్ అని ప్రజలే అంటున్నారని చెప్పారు. హైద‌రాబాద్ బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్ కాలనీలకు చెందిన 22A బాధితులు హ‌రీశ్ రావును క‌లిసి విన‌తిప‌త్రం అందేశారు. ఈ సంద‌ర్భంగా త‌మ క‌ష్టాల‌ను వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా వంద‌లాది మంది 22ఏ (Section 22A) బాధితులు వచ్చి తమ ఆవేదన చెబుతుంటే గుండె కలిచివేసిందని హ‌రీశ్ రావు అన్నారు.

సర్వే నంబర్ 215, 215 పార్ట్‌లలో 30 ఏండ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా సుమారు 1,500 కుటుంబాలు నివసిస్తున్న ఇండ్ల‌ను రాత్రికి రాత్రే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద 22A నిషేధిత జాబితాలో చేర్చడం అత్యంత దుర్మార్గమ‌ని చెప్పారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఇల్లు అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే.. ఆస్తి ప్రొహిబిషన్‌లో (Prohibited Lands) ఉందన్న విషయం తెలియడంతో కాలనీ వాసులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని వెల్ల‌డించారు.

చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన ఇళ్లను అడ్డుపెట్టుకుని ప్రజలపై ఒత్తిడి తెచ్చి 30 శాతం కమీషన్లు దండుకునేందుకే ఇలాంటి కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా కోడై కూస్తున్నార‌ని చెప్పారు. దశాబ్దాలుగా ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలకు ఇప్పుడు 22A భయం చూపిస్తూ, బినామీలతో సెటిల్మెంట్లు చేసుకునే దందాకు తెరలేపారని ఆవేదన వ్యక్త చేస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి రేవంత్ రెడ్డి? (Revanth Reddy) అని ప్ర‌శ్నించారు. బోడుప్పల్ కాలనీ వాసులు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధితులందరూ అధైర్యపడవద్దని సూచించారు. ఈ వసూళ్ల సర్కార్ మెడలు వంచైనా సరే ప్ర‌జ‌ల ఆస్తులను కాపాడే బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంద‌ని చెప్పారు. మాటలు పక్కనబెట్టి, తక్షణమే ఆయా కాలనీలను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి, బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే బాధితుల పక్షాన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంద‌ని హెచ్చరించారు.

Advertisement
Advertisement