Mallu Ravi | బండి సంజయ్‌ని తప్పించాలని బీజేపోళ్లే అంటున్నరు: మల్లు రవి
Mallu Ravi | కేంద్ర మంత్రి బండి సంజయ్ ను పదవి నుండి దించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కొడుకు కేసులో చట్టం తన పని తాను చేస్తుందని చెప్పారు.
- ఆయన పదవి పోతే తమకు పదవి వస్తుందని ఆశపడుతున్నరు
- కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఏం సంబంధం?
- రేవంత్ దూకుడును అడ్డుకునేందుకు ధర్మపురి అరవింద్ ప్రయత్నం
- పాలకుర్తి కాంగ్రెస్ నేతలు కలిసి పని చేయాలి
- గాంధీభవన్ లో మీడియాతో మల్లు రవి
Mallu Ravi | త్రినేత్ర.న్యూస్: కేంద్ర మంత్రి బండి సంజయ్ ను పదవి నుండి దించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంజయ్ పదవి పోతే తమకి పదవి వస్తుందని పలువురు బీజేపీ నేతలు ఆశపడుతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కొడుకు కేసులో చట్టం తన పని తాను చేస్తుందని చెప్పారు. గాంధీ భవన్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ దూకుడును అడ్డుకోవడానికే ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మనది వెస్ట్ బెంగాల్, బీహార్ కాదని, ఇక్కడ సీఎంగా ఉన్నది రేవంత్ రెడ్డి అని కౌంటరిచ్చారు.
మళ్లీ సీఎం అయ్యే సత్తా ఉన్నోడు రేవంత్..
తానే మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించే శక్తి ఉన్నవాడు రేవంత్. ఎత్తుకు పై ఎత్తులు వేసి రేవంత్ మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలడు. సౌత్ ఇండియాలో పార్టీ బలోపేతం కోసం రేవంత్ పని చేస్తున్నారు. డీ శ్రీనివాస్ జీవిత కాలంలో 90 శాతం కాంగ్రెస్ పార్టీలోనే పని చేశారు. డీఎస్ కొడుకు అరవింద్ ఏమో సీఎం రేవంత్ పై ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారు. రేవంత్ ఇమేజ్ చెడగొట్టాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు.
పాలకుర్తిలో ఎవరినీ సస్పెండ్ చేయం: క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, జాన్సీరెడ్డి పలువురిపై ఫిర్యాదు చేశారు. రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్ లపై ఫిర్యాలొచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి కారణం ఇద్దరే అని ఫిర్యాదులు అందాయి. ఈ విషయంలో కృష్ణ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్ తమ వాదన వినిపించారు. ఎమ్మెల్యేతో కలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పని చేస్తామని ఇద్దరు నేతలు హామీ ఇచ్చారు. అందరూ కలిసి పనిచేస్తే పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంటుంది. మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయం చైర్మన్ గా ఉన్న శ్రీకాంత రెడ్డి రెండు వర్గాలను కో ఆర్డినేట్ చేస్తారు. ఎవరినీ సస్పెండ్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు అని మల్లు రవి స్పష్టం చేశారు.
GHMC పరిధిలోని నేతలకు వార్నింగ్..
GHMC కార్పొరేటర్ అభ్యర్థిగా ఎవరికి వాళ్లు ప్రకటించుకున్నారు. యూత్ కాంగ్రెస్ నేతలు తామే పోటీ చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యలు చేస్తే వేటు వేస్తాం. అభ్యర్థి ప్రకటనకు కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రొసీజర్ ఉంటుంది అని మల్లు రవి హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



