Ramchander Rao | పెట్టుబడుల కోసం 7 వేల కి.మీ. వెళ్లాలా..? రేవంత్ దావోస్ పర్యటనపై బీజేపీ చీఫ్ పైర్
Ramchander Rao | తెలంగాణలో పెట్టుబడుల కోసం 7 వేల కిలోమీటర్లు వెళ్లాలా..? అదేదో ఒప్పందాలు రాష్ట్రంలోనే కూర్చొని చేసుకోవచ్చు కదా..? అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ప్రశ్నించారు.
డెస్టినేషన్ అడ్డలా దావోస్..
మంచు చూడడానికి దావోస్ వెళ్లారా..?
పర్యటనల పేరుతో పెట్టుబడుల డ్రామా
కాంగ్రెస్ సర్కార్‌లో 40 శాతం కమిషన్
సీబీఐ విచారణకు రామచందర్ రావు డిమాండ్
Ramchander Rao | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో పెట్టుబడుల కోసం 7 వేల కిలోమీటర్లు వెళ్లాలా..? అదేదో ఒప్పందాలు రాష్ట్రంలోనే కూర్చొని చేసుకోవచ్చు కదా..? అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ప్రశ్నించారు. దావోస్ డెస్టినేషన్ మీటింగ్ అడ్డలా మారిందే తప్ప.. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అని రామచందర్ రావు మండిపడ్డారు. నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గతేడాది దావోస్ పర్యటనలో వచ్చిన పెట్టుబడులు ఏమయ్యాయి..? ఆ కంపెనీల లోకేషన్లు ఎక్కడ ఉన్నాయి..? ఇప్పుడు దావోస్ వెళ్లి ఏం చేస్తున్నారు.. మంచు చూడడానికి వెళ్లారా..? పర్యటనల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని, దమ్ముంటే గత పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో 40 శాతం కమిషన్
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పనిలో 40 శాతం కమిషన్ నడుస్తోందని రామచంద్రరావు ఆరోపించారు. బీఆర్ఎస్‌లో ఒక కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటే, కాంగ్రెస్‌లో నాయకులు పంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కవితకు వాటా తక్కువ వచ్చినందుకే గతంలో లొల్లి జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్‌లోనూ అదే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు.
సీబీఐ విచారణ జరిపించాల్సిందే..
నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బద్నాం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని రామచందర్ రావు ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ తమ వారికి ఈ బ్లాక్‌ను కట్టబెట్టాలని చూసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోంది" అని విమర్శించారు. ప్రభుత్వంలోని అగ్రనేతల మధ్య వాటాల విషయంలో వచ్చిన విభేదాల వల్లే టెండర్ల అవకతవకలు బయటపడ్డాయని, అందుకే ప్రభుత్వం టెండర్లను రద్దు చేసిందని ఆయన ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై 2014 నుండి జరిగిన అన్ని అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



