త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchander Rao | ప‌బ్లిసిటీ కోసమే సిట్ నోటీసులు.. బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Ramchander Rao | ప‌బ్లిసిటీ కోస‌మే సిట్ నోటీసులు జారీ చేస్తున్నార‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓన్లీ యాక్టింగ్.. నో యాక్ష‌న్ అని రేవంత్ స‌ర్కార్‌పై బీజేపీ చీఫ్ నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Jan 29, 2026, 5.40 pm IST

Ramchander Rao | ప‌బ్లిసిటీ కోసమే సిట్ నోటీసులు.. బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

ఫోన్ ట్యాపింగ్‌ను కొన‌సాగిస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం..
ఓన్లీ యాక్టింగ్.. నో యాక్ష‌న్
కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే..
కుంభ‌కోణాల‌పై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాలి..
బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు డిమాండ్

Ramchander Rao | త్రినేత్ర‌.న్యూస్ : ప‌బ్లిసిటీ కోస‌మే సిట్ నోటీసులు జారీ చేస్తున్నార‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓన్లీ యాక్టింగ్.. నో యాక్ష‌న్ అని రేవంత్ స‌ర్కార్‌పై బీజేపీ చీఫ్ నిప్పులు చెరిగారు. నాంప‌ల్లిలోని బీజేపీ కార్యాల‌యంలో రామ‌చంద‌ర్ రావు మీడియాతో మాట్లాడారు.

గ‌త రెండేండ్ల నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక‌దానికొక‌టి దూషించుకుంటున్నాయి. కాంగ్రెసోళ్లు క‌ర‌ప్ష‌న్ చేస్తున్నార‌ని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, కాంగ్రెసేమో మేం చేసిందేమీ లేదు.. మీరు తెచ్చిన పాల‌సీల‌ను ముందుకు తీసుకుపోతున్నామ‌ని చెబుతుంది. అయితే ఈ రెండు పార్టీల ఆలోచ‌న విధానాలు, నిర్ణ‌యాలు ఒకే మాదిరి ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఉన్న‌ప్పుడు గొర్రెల పంపిణీలో స్కాం జ‌రిగింద‌ని విన్నాం. కాంగ్రెస్ ప్ర‌భుత్వం విచార‌ణ జ‌ర‌ప‌డం లేదు. ఈ ప్ర‌భుత్వంలోనూ స్కాం కొన‌సాగుతోంది. సింగ‌రేణిలో బీఆర్ఎస్ హ‌యాంలోనూ అవినీతి జ‌రిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కుంభ‌కోణాల‌కు పాల్ప‌డుతుంది. ఎక్క‌డ కూడా మార్పు లేదు. కేవ‌లం కాంట్రాక్ట‌ర్లు, మంత్రి వ‌ర్గాలు మారుతున్నాయి. క‌మిష‌న్లు పెరుగుతున్నాయ‌ని రామ‌చంద‌ర్ రావు పేర్కొన్నారు.

నోటీసులే నోటీసులు.. ఇవి త‌ప్ప యాక్ష‌న్ లేదు..

ఇవ‌న్నీ ఒక వైపు అయితే.. ఫోన్ ట్యాపింగ్ మ‌రో అంశం. ఈ కేసు విచార‌ణ ప్రారంభ‌మై రెండేండ్లు అవుతుంది.. నోటీసులే నోటీసులు.. ఇవి త‌ప్ప యాక్ష‌న్ లేదు. నోటీసులు ఇస్తున్నారు ప‌బ్లిసిటీ వ‌స్తుంది. అంత‌కు మించి ఏం లేదు. నిన్న లిక్క‌ర్ పాల‌సీ అని బీఆర్ఎస్ నేత‌లు బ‌య‌ట‌పెట్టారు. దాని మీద కూడా ప్ర‌భుత్వం స్పంద‌న లేదు.. మీరు అనుస‌రించిన పాల‌సీల‌నే అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. ధ‌ర‌ణి, భూభార‌తిలోనూ కుంభ‌కోణాలు వెలుగు చూశాయి. ఈ రెండు పార్టీల‌ ఆలోచ‌న‌ల‌ను, విధానాల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు గ‌మ‌నించాలి అని రామ‌చంద‌ర్ రావు సూచించారు.

సిట్టింగ్ జ‌డ్జితో జ్యుడిషియ‌ల్ ఎంక్వైరీ

సిట్‌లు, పిట్‌లు కాదు.. సిట్ ప‌నికిరాదు. కాళేశ్వ‌రం కూడా సీబీఐకి మొత్తం ఇవ్వ‌లేదు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కాపాడింది. ఇప్పుడేమో ఆయా కేసుల్లో బీఆర్ఎస్ నేత‌ల‌ను రేవంత్ ప్ర‌భుత్వం కాపాడుతుంది. ఇదంతా క్విడ్ ప్రోకో. 2014 నుంచి నేటి వ‌ర‌కు అప్ప‌టి ప్ర‌భుత్వ పాల‌సీల‌, ఇప్ప‌టి ప్ర‌భుత్వ పాల‌సీల మీద రివ్యూ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జితో జ్యుడిషియ‌ల్ ఎంక్వైరీ వేయాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌ని రామ‌చంద‌ర్ రావు పేర్కొన్నారు.

భ‌య‌ప‌డి బీజేపీ మీద నోరు పారేసుకుంటున్నారు..

మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీ లేనే లేదు.. అది మ‌తం పార్టీ అని ఒక‌రు అంటున్నారు. నోటీసుల పేరిట డైవ‌ర్ష‌న్ చేస్తూ.. బీజేపీపై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మొన్న‌టి పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీజేపీ పుంజుకుంది. ఇక మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మెజార్టీ స్థానాలు గెలిచే అవ‌కాశం ఉంద‌ని భావించి.. భ‌య‌ప‌డి బీజేపీ మీద నోరు పారేసుకుంటున్నారు అని రామ‌చంద‌ర్ రావు ధ్వ‌జ‌మెత్తారు.

ఫోన్ ట్యాపింగ్‌ను కొన‌సాగిస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం..

కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్‌ను కొన‌సాగిస్తోంది. త‌ప్పుడు కేసుల‌ను బ‌నాయిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే. అవినీతి చేయ‌డం కాంగ్రెస్ పార్టీకి అల‌వాటు. యూపీఏ ప్ర‌భుత్వంలో అనేక కుంభ‌కోణాలు జ‌రిగాయి. అదే బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక అవినీతి ర‌హిత ప్ర‌భుత్వం న‌డుపుతున్నాం. 5 వేల కోట్లు రిక‌వ‌రీ చేసి చూపించాం. యూపీఏ ప్ర‌భుత్వం త‌ప్పిదాల‌పై ఈడీ కేసులు పెట్టించి త‌వ్వుతున్నాం.. రిక‌వ‌రీ చేస్తున్నాం. మీరు ఏం చేశారు. నోటీసులు ఇస్తున్నారు.. అరెస్టులు చేయ‌డం లేదు. కేవ‌లం అధికారుల మీద క‌సి తీర్చుకుంటున్నారు. ఓన్లీ యాక్టింగ్ త‌ప్ప యాక్ష‌న్ లేదు అని రామ‌చంద‌ర్ రావు మండిప‌డ్డారు.

Advertisement

తాజావార్తలు

Advertisement