త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchander Rao | రాజ్యాంగాన్ని కాలరాసి ఇప్పుడు మొసలి కన్నీరు.. కాంగ్రెస్‌పై రామ‌చంద‌ర్ రావు ఫైర్

Ramchander Rao | కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాలరాసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ రామచంద‌ర్‌ రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెసేతర ప్రభుత్వంలోనే అంబేద్కర్‌కు సముచిత న్యాయం దక్కిందని గుర్తు చేశారు.

S

Telangana | Published On Apr 14, 2026, 3.27 pm IST

Ramchander Rao | రాజ్యాంగాన్ని కాలరాసి ఇప్పుడు మొసలి కన్నీరు.. కాంగ్రెస్‌పై రామ‌చంద‌ర్ రావు ఫైర్
Advertisement

Ramchander Rao | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాలరాసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ రామచంద‌ర్‌ రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెసేతర ప్రభుత్వంలోనే అంబేద్కర్‌కు సముచిత న్యాయం దక్కిందని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చదువుకున్న ప్రాంతాలను గుర్తించి గౌరవ స్థానం కల్పించారని గుర్తు చేశారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మంగళవారం పార్టీలకతీతంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆనంద్‌బాగ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి రామచంద‌ర్‌ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో గొప్ప నాయకుడిగా నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ రామచంద‌ర్ రావు కొనియాడారు. ఆయన కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని, సమానత్వం, న్యాయం, మానవ జాతి కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు అని కొనియాడారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే ఉన్నత విలువల పునాదులపై ఒక బలమైన, న్యాయబద్ధమైన నవ భారత నిర్మాణానికి బాబాసాహెబ్ స్పష్టమైన రూపాన్నిచ్చారన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న కడగొట్టు వ్యక్తికి సైతం హక్కులు, ఆత్మగౌరవం, సమాన అవకాశాలు దక్కాలనే ఉదాత్త లక్ష్యంతో ఆయన తన జీవితాన్ని అంకితం చేశార‌ని పేర్కొన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. రామచంద‌ర్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, వాసంశెట్టి శ్రీనివాస్, వెంకటేష్ యాదవ్, దళిత సంఘాల నేతలు, మాజీ కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, క్యానం రాజ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement