Trump’s New H-1B Rule | ఉద్యోగం పోతే ఇంటికే.. ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. ఆందోళనలో టెకీలు
Trump’s New H-1B Rule | విదేశీయుల నెత్తిన ట్రంప్ ప్రభుత్వం మరో పిడుగు వేసేందుకు సిద్ధమైంది. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్1బీ సహా పలు వర్క్ వీసాదారులకు ఇప్పటివరకు ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను ఎత్తివేసేందుకు సిద్ధమైంది. అదే జరిగితే ఉద్యోగం పోయిన వెంటనే కొత్త ఉద్యోగం వెతుక్కునే అవకాశయే ప్రమాదం ఎదురవుతోంది.
- హెచ్1బీ సహా 8 కేటగిరీలకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఎత్తివేతకు ట్రంప్ సర్కార్ ప్రతిపాదన
- నేడు ఫెడరల్ రిజిస్టర్‌లో పబ్లిష్
- 60 రోజుల్లో అభిప్రాయాలు స్వీకరణ..
- ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న డీహెచ్ఎస్
- డిపోర్టేషన్ ప్రక్రియకు తొలి అడుగు.. ‘నోటీస్ టు అపియర్’ జారీకి అవకాశం
- భారతీయ టెక్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం
Trump’s New H-1B Rule | విదేశీయుల నెత్తిన ట్రంప్ ప్రభుత్వం మరో పిడుగు వేసేందుకు సిద్ధమైంది. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్1బీ సహా పలు వర్క్ వీసాదారులకు ఇప్పటివరకు ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను ఎత్తివేసేందుకు సిద్ధమైంది. అదే జరిగితే ఉద్యోగం పోయిన వెంటనే కొత్త ఉద్యోగం వెతుక్కునే అవకాశయే ప్రమాదం ఎదురవుతోంది. అమెరికాలో ఉండేందుకు మరో చట్టబద్ధమైన అనుమతి లేని విదేశీయులు వెంటనే దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే హెచ్–1బీ వీసా ఫీజుల పెంపు, వీసా ప్రక్రియలపై ఆంక్షలు, ఇమ్మిగ్రేషన్‌పై కఠిన వైఖరితో విదేశీయులకు చుక్కలు చూపిస్తున్న ట్రంప్ సర్కారు.. తాజాగా తీసుకొస్తున్న ఈ కొత్త ప్రతిపాదన భారతీయ టెకీల్లో మరింత రేకెత్తిస్తోంది. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగింపు (Eliminating the Discretionary 60-day Grace Period) పేరుతో రూపొందించిన ఈ ప్రతిపాదనను శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించనున్నారు. దీనిపై ప్రజలు, సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు 60 రోజుల గడువు ఉంటుంది. ఆ అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత ప్రతిపాదనను తుది నిబంధనగా అమలు చేయాలా? వద్దా? అన్నది నిర్ణయం తీసుకుంటారు.
భారతీయ టెకీలకు పెద్ద దెబ్బ!
ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ టెక్నాలజీ ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా టెక్ కంపెనీలు ప్రతి ఏడాది భారత్, చైనా తదితర దేశాల నుంచి వేలాది మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులను హెచ్1బీ వీసాలపై నియమించుకుంటున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, ఐటీ, ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో విదేశీ నిపుణుల నియామకానికి హెచ్1బీ వీసా కీలకం. ఇప్పటివరకు హెచ్1బీ ఉద్యోగి ఉద్యోగం కోల్పోతే వెంటనే అమెరికా నుంచి వెళ్లిపోవాల్సిన అవసరం ఉండేది కాదు. గరిష్టంగా 60 రోజుల గ్రేస్ పీరియడ్‌లో కొత్త కంపెనీలో ఉద్యోగం వెతుక్కోవడం, కొత్త ఉద్యోగ ప్రతిపాదనలు, అవసరమైన వీసా ప్రక్రియను ప్రారంభించేందుకు అవకాశాలు ఉండేవి. ఇప్పుడు ఆ వెసులుబాటును తొలగిస్తే.. ఉద్యోగం పోయిన వెంటనే కొత్త ఉద్యోగం కోసం సమయం లేకుండా పోయే అవకాశం ఉన్నది.
కొత్త రూల్ ఏం చెబుతోంది?
ప్రస్తుతం కొన్ని నాన్–ఇమిగ్రెంట్ వీసాలపై ఉన్న విదేశీ ఉద్యోగులకు ఉద్యోగం ముగిసిన తర్వాత గరిష్టంగా 60 రోజుల వరకు అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉంది. ఇది ‘డిస్క్రిషనరీ గ్రేస్ పీరియడ్’. అంటే సంబంధిత నిబంధనల ప్రకారం గరిష్టంగా 60 రోజుల వరకు వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిబంధనలో ఈ గ్రేస్ పీరియడ్‌ను పూర్తిగా తొలగించాలని డీహెచ్ఎస్ పేర్కొంది. ఉద్యోగం పోయిన వెంటనే ఉద్యోగానికి ఆధారమైన నాన్–ఇమిగ్రెంట్ స్టేటస్, అమెరికాలో కొనసాగేందుకు ఉన్న హక్కుపై ప్రశ్నలు తలెత్తేలా ట్రంప్ సర్కారు కొత్త విధానం తీసుకురాబోతోంది. ఈ ప్రతిపాదనలో ఈ1, ఈ2, ఈ3, హెచ్1బీ, హెచ్1బీఎన్, ఎల్1, ఓ1, టీఎన్ నాన్–ఇమిగ్రెంట్ కేటగిరీలను, అలాగే ఆయా వీసాదారులపై ఆధారపడిన కుటుంబ సభ్యులను సైతం ఈ జాబితాలో చేర్చారు.
ఉద్యోగం ఊడితే.. తాట్టాబుట్టా సర్దాల్సిందే..
కొత్త ప్రతిపాదించిన నిబంధనలు అమలులోకి వస్తే.. వీసా గడువు ఇంకా ఉన్నప్పటికీ ఉద్యోగం కోల్పోయిన విదేశీయుల పరిస్థితి కిష్టంగా మారుతుంది. అమెరికాలో ఉండేందుకు మరో ప్రత్యేక చట్టబద్ధమైన అనుమతి లేకపోతే దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటివరకు ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఉన్న 60 రోజుల సమయం కొత్త ఉద్యోగం కోసం ఉపయోగపడేది. కొత్త సంస్థలో ఉద్యోగం దొరికితే వీసా స్టేటస్‌ను కొనసాగించుకునే అవకాశం ఉండేది. ఈ గడువు లేకపోతే ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి కొత్త ఉద్యోగం వెతుక్కోవడం, కంపెనీ మార్పుకు సంబంధించి ప్రక్రియ, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పాటించేందుకు తగిన సమయం దొరికే అవకాశం ఉండకపోవచ్చు. అంటే.. ఉద్యోగం పోయిన పరిస్థితిలో ‘కొత్త ఉద్యోగం వెతుక్కుని అమెరికాలోనేనే ఉండే అవకాశం ఉండదు. బదులుగా యూఎస్ వీడాల్సిన పరిస్థితి తలెత్తనుంది.
డిపోర్టేషన్ ముప్పు కూడా?
కొత్త ప్రతిపాదనలో మరో కీలక అంశాన్ని ఇమ్మిగ్రేషన్ న్యాయ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. గ్రేస్ పీరియడ్ నిబంధనను తొలగిస్తే కొందరు విదేశీయులకు ‘నోటీస్ టు అపియర్ (NTA)’ జారీ అయ్యే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ అటార్నీ సంస్థ ఫ్రాగోమెన్ తెలిపింది. ఎన్‌టీఏ అనేది డిపోర్టేషన్ ప్రక్రియను ప్రారంభించే తొలి అధికారిక చర్య. అంటే ఉద్యోగం కోల్పోయిన తర్వాత సరైన స్టేటస్‌లో కొనసాగలేకపోయిన కొందరు విదేశీయులు కేవలం అమెరికా నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితినే కాకుండా.. డిపోర్టేషన్ ప్రక్రియను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విదేశీ ఉద్యోగి ఉద్యోగం పోయిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకెళ్లాల్సిన నిబంధనలు ఉన్న వీసా కేటగిరీల వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో హెచ్1బీ, ఓ1, పీ వంటి కేటగిరీలు ఉన్నాయి.
ఒబామా హయాంలో వెసులుబాటు
ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఒబామా ప్రభుత్వం కాలం అందుబాటులోకి వచ్చింది. ఉద్యోగం కోల్పోయిన విదేశీ నిపుణులు వెంటనే దేశం విడిచి వెళ్లకుండా.. కొత్త ఉద్యోగ అవకాశాలను వెతుక్కోవడానికి ఈ వెసులుబాటు ఉపయోగపడింది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే ప్రక్రియను సులభతరం చేయడమే దీని ఉద్దేశం. ముఖ్యంగా అమెరికా కంపెనీలకు అవసరమైన నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులు ఉద్యోగం మారే సమయంలో ఎదురయ్యే ఇమ్మిగ్రేషన్ సమస్యలను తగ్గించేందుకు ఈ వెసులుబాటు కలిగింది.
‘ఉద్యోగం’తోనే వీసా స్టేటస్..
గ్రేస్ పీరియడ్‌ను తొలగించడానికి డీహెచ్ఎస్ తన ప్రతిపాదనకు కారణాలను కూడా వివరించింది. విదేశీయుడి నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్‌కు, అతను అమెరికాలో ప్రవేశించడానికి లేదంటే స్టేటస్ పొందడానికి కారణమైన నిర్దిష్ట ఉద్యోగం లేదా కార్యకలాపాలకు మధ్య నేరుగా సంబంధం ఉండేలా చేయడమే ఉద్దేశమని పేర్కొంది. అలాగే ప్రభుత్వ పరిపాలనా భారాన్ని తగ్గించడానికీ ఈ మార్పు ఉపయోగపడుతుందని తెలిపింది. అయితే, విదేశీ ఉద్యోగుల విషయంలో దీని ప్రభావం గణనీయంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వెంటనే కొత్త ఉద్యోగం దొరకని వారికి తక్కువ సమయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇక ముందేం జరుగుతుంది?
ఇది ప్రస్తుతం ప్రతిపాదన మాత్రమే. వెంటనే అమల్లోకి వచ్చినట్లు కాదు. ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రతిపాదన పబ్లిషింగ్ తర్వాత 60 రోజుల పాటు ప్రజలు, కంపెనీలు, ఇమ్మిగ్రేషన్ నిపుణులు, ఇతర సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఆ అభిప్రాయాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. నిబంధన తుది రూపంలో అమల్లోకి వస్తే.. హెచ్1బీ సహా సంబంధిత వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీయుల ఉద్యోగ భద్రతతో పాటు ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌పై కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఇకపై ఉద్యోగం ఉన్నంతవరకే అమెరికాలో కొనసాగడం.. ఉద్యోగం పోయిన వెంటనే దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొచ్చే దిశగా ట్రంప్ సర్కారు ఈ ప్రతిపాదనను తీసుకువచ్చింది. విదేశీయుల స్థానంలో స్థానికులైన అమెరికన్స్‌కు ఉద్యోగాలు దక్కేలా కంపెనీలను ప్రోత్సహించేందుకు ఈ కఠిన నిబంధనల వెనుక ఉద్దేశంగా భావిస్తున్నారు. అమెరికాలో భారీ సంఖ్యలో పనిచేస్తున్న భారతీయ టెక్ నిపుణులు ఈ పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vinesh Phogat | వినేశ్ ఫొగాట్‌కు ఎదురుదెబ్బ.. ట్రయల్స్‌కు హైకోర్టు నో!
సెప్టెంబర్ 11, 2026

TG Assembly | సభలో మాట్లాడలేకే బీఆర్ఎస్ నేతల డైవర్షన్ పాలిటిక్స్: ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్
సెప్టెంబర్ 11, 2026

Special Trains | పండుగల వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్.. ఈ రూట్లో భారీగా ప్రత్యేక రైళ్లు..!
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●UPI Charges | మళ్లీ తెరపైకి యూపీఐ ఛార్జీలు..? బ్యాంకులకే భారీ వాటా..?
- ●Ramachander Rao | మోదీ ప్రజా సేవ ప్రస్థానానికి 25 ఏళ్లు..
- ●Bank Staff | బ్యాంకు సిబ్బంది కళ్లలో కారం చల్లి.. నగదుతో ఉడాయించిన వ్యక్తి
- ●Tripti Dimri | అలనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాత్రలో తిప్తి డిమ్రి - వెండితెరపైకి ట్రాజెడీ లవ్‌స్టోరీ
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు షాక్.. 3 నెలల కనిష్ఠానికి నిఫ్టీ..
- ●Vakiti Srihari | బీసీలకు రిజర్వేషన్లు దానం కాదు.. అది మా హక్కు

UPI Charges | మళ్లీ తెరపైకి యూపీఐ ఛార్జీలు..? బ్యాంకులకే భారీ వాటా..?

Ramachander Rao | మోదీ ప్రజా సేవ ప్రస్థానానికి 25 ఏళ్లు..

Bank Staff | బ్యాంకు సిబ్బంది కళ్లలో కారం చల్లి.. నగదుతో ఉడాయించిన వ్యక్తి

Tripti Dimri | అలనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాత్రలో తిప్తి డిమ్రి - వెండితెరపైకి ట్రాజెడీ లవ్‌స్టోరీ



