త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramachander Rao | కాంగ్రెస్ ప‌త‌నానికి వెలుగుమట్ల నుంచే నాంది.. బీజేపీ చీఫ్ కీల‌క వ్యాఖ్య‌

Ramachander Rao | కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి వెలుగుమ‌ట్ల‌ నుంచే నాంది ప‌లుక‌బోతున్న‌ట్లు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు పేర్కొన్నారు. పేదల హక్కుల కోసం బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుంది. ప్రజల పక్షాన, న్యాయం కోసం ప్రశ్నించే గళాన్ని ఎవరూ అణచివేయలేరు అని రామ‌చంద‌ర్ రావు తేల్చిచెప్పారు.

S

Telangana | Published On Mar 1, 2026, 6.55 pm IST

Ramachander Rao | కాంగ్రెస్ ప‌త‌నానికి వెలుగుమట్ల నుంచే నాంది.. బీజేపీ చీఫ్ కీల‌క వ్యాఖ్య‌
Advertisement

ఇది పేద‌ల వ్యతిరేక ప్ర‌భుత్వం
రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కోస‌మే ఇండ్ల కూల్చివేత‌
కూల్చిన చోట పేద‌ల‌కు ఇండ్లు నిర్మించాలి
బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు డిమాండ్

Ramachander Rao | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి వెలుగుమ‌ట్ల‌ నుంచే నాంది ప‌లుక‌బోతున్న‌ట్లు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు పేర్కొన్నారు. పేదల హక్కుల కోసం బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుంది. ప్రజల పక్షాన, న్యాయం కోసం ప్రశ్నించే గళాన్ని ఎవరూ అణచివేయలేరు అని రామ‌చంద‌ర్ రావు తేల్చిచెప్పారు. ఖమ్మం శివారు వెలుగుమట్లలోని భూదాన్‌ భూములను ఆయన పరిశీలించారు. భూ నిర్వాసితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో రామచందర్‌రావు మాట్లాడారు.

నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పేదల ఇండ్ల‌ను కూల్చివేశారు. భూదాన్‌ బోర్డు పట్టాలున్న పేదల ఇళ్లను కూల్చివేశారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. పేదల వ్యతిరేక ప్రభుత్వం. పేదల ఇళ్లు కూలగొట్టి ఏం సాధించారు?బాధితుల పక్షాన భాజపా పోరాడుతుంది. కూల్చిన చోట పేదలకు 100 గజాల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే పేదలను పంపించేస్తున్నారు అని రామ‌చంద‌ర్ రావు ధ్వ‌జ‌మెత్తారు.

పాలకుల ప్రధాన బాధ్యత పేదలకు రక్షణ కల్పించడం, కానీ భక్షకులుగా మారడం కాదు. శిథిలాల మధ్య మట్టిపాలైన చిన్నారుల పుస్తకాలు, చెల్లాచెదురైన ధాన్యం చూస్తుంటే మనసు తీవ్ర ఆవేదనకు గురైంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చింది కేవలం ఇటుకల గోడలను కాదు.. నిరుపేదల ఆశయాలను, కలలను! ఖమ్మం అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఆశ్రయ కేంద్రంలో తలదాచుకుంటున్న బాధిత కుటుంబాలను ఈరోజు పరామర్శించాను. వారు పడుతున్న కన్నీటి వేదన, మాటలకందని ఆవేదన ప్రస్తుత ప్రభుత్వ క్రూరత్వానికి సజీవ సాక్ష్యాలు అని రామ‌చంద‌ర్ రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తొలి క్షణం నుండి బాధితులకు కొండంత అండగా నిలబడి, వారికి ఆశ్రయ కేంద్రంలో నిరంతర అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ఖమ్మం జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులకు, నాయకులకు మరియు కార్యకర్తలకు నా ప్రత్యేక అభినందనలు అని ఆయ‌న పేర్కొన్నారు.

Advertisement
Advertisement