Ramachander Rao | మజ్లిస్ సహకారంతోనే కాంగ్రెస్ దాడులు.. సీఎం రేవంత్‌పై బీజేపీ చీఫ్ ఫైర్
Ramachander Rao | ఉత్తర తెలంగాణలో పూర్తిగా ఉద్రిక్త వాతావరణం నెలకొందని.. మజ్లిస్ సహకారంతోనే కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు మండిపడ్డారు.
ఉత్తర తెలంగాణలో ఉద్రిక్త వాతావరణం
హైదరాబాద్‌లో ఆలయాలపై దాడులు
రాష్ట్రంలో శాంతిభద్రతలు గాలికి
కాంగ్రెస్ సర్కార్‌పై రామచందర్ రావు ఫైర్
Ramachander Rao | త్రినేత్ర.న్యూస్ : ఉత్తర తెలంగాణలో పూర్తిగా ఉద్రిక్త వాతావరణం నెలకొందని.. మజ్లిస్ సహకారంతోనే కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు మండిపడ్డారు. ఉత్తర తెలంగాణలో హిందువులపై దాడులు, హైదరాబాద్ నగరంలో ఆలయాలపై దాడులపై డీజీపీ శివధర్ రెడ్డికి బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలోని బృందం ఫిర్యాదు చేసింది. అనంతరం రామచందర్ రావు మీడియాతో మాట్లాడారు.
గత కొన్ని రోజుల క్రితం బాన్సువాడలో ఒక హిందూ అమ్మాయి భక్తి గీతాలు వింటూ ఉంటే కొందరు అభ్యంతరం చెబుతూ దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ మత ఘర్షణ వాతావరణాన్ని ఎంఎంఏఎం నేతలు సృష్టించారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు, హిందూ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌లో పాల్గొన్న బీజేపీ నేతలు, హిందూ యువకులను అరెస్టు చేశారు. 27 మందిని జైల్లో పెట్టారు. అదే కేసులో ఇంకా పది మందిని అబ్‌స్కాండింగ్ చూపిస్తూ కుటుంబ సభ్యులను పోలీసులు వేధించారు. అదే సమయంలో కామారెడ్డిలో మా ఎమ్మెల్యే వెంకట రమాణారెడ్డి మీద కాంగ్రెస్ నేతలు దాడి చేసే ప్రయత్నం చేశారు. వందలాది మంది కాంగ్రెస్ నేతలు మజ్లిస్ సహకారంతో బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు మీద దాడి చేశారు. సమయానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పిందని రామచందర్ రావు తెలిపారు.
ఉత్తర తెలంగాణలో భయంకరమైన వాతావరణం
రుద్రారం గ్రామంలో అడ్వకేట్ కల్యాణి మీద దాడి చేశారు ఎంఐఎం నేతలు. అక్కడ మత ఘర్షణ వాతావరణం సృష్టించారు. నిన్న, ఇవాళ పోలీసులు మా కార్యకర్తలను పట్టుకెళ్తున్నారు. ఉత్తర తెలంగాణలో భయంకరమైన వాతావరణం సృష్టించారు. మజ్లిస్ అరాచకాలు పెరిగిపోతున్నాయి. సీఎం రేవంత్ ఉన్నారన్న ధైర్యంతో మజ్లిస్ కార్యకర్తలు హిందువులపై అత్యాచారాలు, దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవడం లేదు. మా మీద దాడులు జరిగాయి.. అయినా కూడా కేసులు మా మీదనే పెడుతున్నారు. దాడులు చేసిన వారిపైన కేసులు లేవు. ఇలాంటి వాతావరణానికి సీఎం రేవంతే కారణం అని బీజేపీ చీఫ్ మండిపడ్డారు.
రంజాన్ నాడు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు..?
చాంద్రాయణ గుట్ట, బార్కస్, సఫిల్‌గూడ, జూబ్లీహిల్స్, కీసరలో ఆలయాలపై దాడులు చేశారు. ఈ ఘటనల వెనుక ఎవరున్నారు.. కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహం లేదా..? మార్చి 16న బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి 20న బడ్జెట్ ప్రవేశపెడుతారట.. రంజాన్ నాడు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు..? ఎందుకు అదే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కారణం ఏంటి..? శాంతి భద్రతలు మీ చేతులో ఉన్నాయి.. ప్రజలు క్షేమంగా లేరు. దాడులకు పాల్పడుతూ అరాచకాలు సృష్టిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీకి విన్నవించామని రామచందర్ రావు తెలిపారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



