Ramachander Rao | మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. కానీ ఇండ్లను కూల్చొద్దు : రామచందర్ రావు
Ramachander Rao | మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. కానీ ఇండ్లను కూల్చొద్దని బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సూచించారు. గాంధీ సరోవర్, మూసీ సుందరీకరణ పేరుతో పేదోళ్ల ఇండ్లను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Ramachander Rao | త్రినేత్ర.న్యూస్ : మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. కానీ ఇండ్లను కూల్చొద్దని బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సూచించారు. గాంధీ సరోవర్, మూసీ సుందరీకరణ పేరుతో పేదోళ్ల ఇండ్లను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రామచందర్ రావు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
మూసీ ప్రక్షాళనకు, గాంధీ సరోవర్‌కు బీజేపీ వ్యతిరేకం కాదు. కృష్ణా నదిలో కలిసేంత వరకు మూసీ నది స్వచ్ఛంగా ఉండాలి. దిగువన ఉన్న రైతాంగానికి నాణ్యతతో కూడిన సాగు నీరు అందించాలి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో, దేశంలో బీజేపీకి ఒక విధానమంటూ లేదన్నారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. కానీ గాంధీ సరోవర్ పేరటి ఇండ్లను కూలగొట్టడం సరికాదు. లీగల్‌గా ఉన్న ఇండ్లను కూలగొట్టడానికి అవకాశం లేదు. కూలగొట్టకుండా కూడా సుందరీకణ చేయొచ్చు. నదుల ప్రక్షాళన ఎలా చేయాలో సబర్మతి నదిని చూసి నేర్చుకోండి. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నిర్వాసితులకు ముందుగా ఇళ్లు కట్టించి, పునరావాసం కల్పించిన తర్వాతే సబర్మతి ప్రక్షాళన చేపట్టారు అని రామచందర్ రావు గుర్తు చేశారు.
కానీ మీరు భయభ్రాంతులకు గురి చేసి, గడ్డపార చేతుల పట్టుకొని ఇండ్లు కూలగొట్టేందుకు తిరుగుతున్నారు. నిరుపేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లను కూలగొడితే తప్పకుండా వ్యతిరేకిస్తాం. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు నాలుగైదు వందల ఎకరాల భూమి ఎందుకు..? రీ లైన్‌మెంట్ చేసుకోండి.. గాంధీ విగ్రహం ఆకాశం దాకా పెట్టినా అభ్యంతరం లేదు. సంతోషిస్తాం. ఇండ్లను కూలగొట్టి ప్రక్షాళన చేస్తే సరికాదు అని రామచందర్ రావు ధ్వజమెత్తారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



