N Ramchander Rao | జంతర్‌మంతర్‌లో అందరూ యాంటీ నేషనల్సే : రామచందర్ రావు
N Ramchander Rao | సీజేపీ పేరుతో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న వారంతా యాంటీ నేషనల్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్సే అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ధ్వజమెత్తారు. సీజేపీ ధర్నాలో నీట్ అభ్యర్థులెవరూ లేరని ఆయన పేర్కొన్నారు.
N Ramchander Rao | త్రినేత్ర.న్యూస్ : సీజేపీ పేరుతో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న వారంతా యాంటీ నేషనల్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్సే అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ధ్వజమెత్తారు. సీజేపీ ధర్నాలో నీట్ అభ్యర్థులెవరూ లేరని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ ఇంటి వద్ద రాహుల్ గాంధీ చేపట్టిన ధర్నాకు నిరసనగా రాష్ట్రంలో రామచందర్ రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మీడియాతో మాట్లాడారు.
రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి నేతలు దేశాన్ని విడగొట్టేటటువంటి మాటలు మాట్లాడారు. తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌ను చూశాం. ఆ తుక్‌డే గ్యాంగ్ కొత్త పేరు సీజేపీతో ముందుకు రావడం జరిగింది. నీట్ రాసిన వారెవరూ జంతర్ మంతర్ ధర్నాలో లేరు. అక్కడ నిరసన చేపట్టిన వారిలో సగం మందికి నీట్ అంటే ఏంటో తెలియదు. మొత్తం యాంటీ సోషల్, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్‌ను జమ చేసి దేశంలో విభజన రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. పార్లమెంట్ నడుస్తున్న సమయంలో లోపల మాట్లాడకుండా.. ప్రధాని నివాసం ఇంటి వద్ద ధర్నా చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. నీట్ మీద ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంటే మీరు ఎందుకు చర్చ రావడం లేదు. మీ దగ్గర మెటీరియల్ లేదు కాబట్టే రావడం లేదు. మీ మెదడులో ఏం లేదు కాబట్టే రోడ్ల మీద పడి డ్రామా చేస్తున్నారు అని రాహుల్ గాంధీపై రామచందర్ రావు నిప్పులు చెరిగారు.
సీజేపీ కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు
సీజేపీ కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు వచ్చాయి. ఆర్టికల్ 370 మళ్లీ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. చైనా, పాకిస్తాన్‌కు మద్దతు తెలిపే వ్యక్తులు వచ్చారు. గతంలో అన్నా హజారేను ముందు పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను తీసుకొచ్చారు. వాళ్ల తండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈయన దేశ వ్యతిరేకంగా మాట్లాడారు. పాక్, చైనాకు సపోర్ట్ చేశారు. సీజేపీకి పూర్తిగా మద్దతు పలుకుతున్నట్లు లేఖ రాశారని రామచందర్ రావు తెలిపారు.
బంగ్లాదేశ్, నేపాల్‌లో మాదిరిగానే ఢిల్లీలో కూడా
దేశ వ్యతిరేక శక్తులకు రాహుల్ సపోర్ట్ చేస్తున్నారు. రాహుల్‌కు బుద్ది లేదంటే మన సీఎంకు కూడా బుద్ధి లేనోళ్లకు సపోర్ట్ చేస్తున్నాడు. ఇవన్నీ దేశ వ్యతిరేక శక్తులు. ప్రధాని ఇంటి వద్ద డ్రామా చేశారు. బంగ్లాదేశ్, నేపాల్‌లో మాదిరిగానే ఢిల్లీలో కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. యువకులు, విద్యార్థులు దేశం కోసం ప్రాణాలు ఇస్తారు. ఇలాంటి విదేశీ తొత్తులకు లొంగరు. విదేశాల నుంచి కోట్లాది రూపాయాలు తీసుకొచ్చి దేశంలో విధ్వంసం సృష్టించడానికి ఈ శక్తులు పని చేస్తున్నాయి. అందులో భాగంగా రాహుల్ విదేశీ మాయలో పడి విదేశీ ఏజెంట్లుగా దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విధ్వంసం రాజకీయాలకు చరమ గీతం పాడుతాం అని రామచందర్ రావు హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

PM Modi | ప్రశ్నించడం కాదు.. సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఉండాలి.. యువతకు ప్రధాని కీలక సూచన
ఆగస్టు 8, 2026

Womens Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ Vs రిజుజు.. ఎక్స్ వేదికగా మాటల యుద్ధం
ఆగస్టు 8, 2026

పదవుల మోజు పక్కనపెట్టండి.. పునాదులు తవ్వండి: ఢిల్లీ వేదికగా కమలనాథుల నయా ‘మిషన్ 2028’!
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●KCR | పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ.2.25 కోట్లు అందించాలని నిర్ణయం
- ●PM Modi | ప్రశ్నించడం కాదు.. సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఉండాలి.. యువతకు ప్రధాని కీలక సూచన
- ●OTT Review | ఇల్లీగల్ ఎఫైర్స్‌పై వచ్చిన మలయాళం మూవీ - ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో సాగే థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే?
- ●Pilot Rohith Reddy | పైలట్ రోహిత్‌రెడ్డికి షాక్.. చెక్ బౌన్స్ కేసులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
- ●Adobe | ఇక చాట్ జీపీటీలో ఫొటోషాప్.. అడోబ్ కొత్త ప్లగిన్.. ఎలా ఉపయోగించాలంటే..?
- ●Ponnam Prabhakar | పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే హైదరాబాద్ ఆరోగ్యంగా ఉంటుంది

KCR | పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ.2.25 కోట్లు అందించాలని నిర్ణయం

PM Modi | ప్రశ్నించడం కాదు.. సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఉండాలి.. యువతకు ప్రధాని కీలక సూచన

OTT Review | ఇల్లీగల్ ఎఫైర్స్‌పై వచ్చిన మలయాళం మూవీ - ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో సాగే థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే?

Pilot Rohith Reddy | పైలట్ రోహిత్‌రెడ్డికి షాక్.. చెక్ బౌన్స్ కేసులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ



