Attack on Komatireddy Office | మంత్రి కోమటిరెడ్డి ఆఫీసుపై కోడిగుడ్లతో బీజేపీ దాడి.. ఆగ్రహంతో కాంగ్రెస్ నేతల ప్రతిదాడి
Attack on Komatireddy Office | నల్లగొండ జిల్లా కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల దాడులు, ప్రతిదాడులతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆఫీసుపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు.
Attack on Komatireddy Office | త్రినేత్ర.న్యూస్: నల్లగొండ జిల్లా కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల దాడులు, ప్రతిదాడులతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆఫీసుపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. అనంతరం మంత్రి దొష్టిబొమ్మతో పాటు అక్కడే ఉన్న కోమటిరెడ్డి ఫ్లెక్సీని తగలబెట్టారు. తమ పార్టీ ఆఫీసుపైకి వస్తే ప్రతిఘటన తప్పదని బీజేపీ శ్రేణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ నాయకులు నల్లగొండ బీజేపీ ఆఫీసుపై దాడికి తెగబడ్డారు. జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై కోమటిరెడ్డి వర్గం దాడి చేయగా ఇంట్లో ఉన్న ఫర్నీచర్ పూర్తగా ధ్వంసమైంది. ఈ క్రమంలో ఒకానొక దశలో ఇరు పార్టీల కార్యకర్తలు ఎదుపడి పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో కాసేపు అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో గొడవ సద్దుమణిగినట్లయింది.
ఇదిలా ఉండగా సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం బీజేపీ ఆఫీస్ గేట్లకు నల్లరంగు పూయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనికి ప్రతికారంగా గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం నేతలు ప్రయత్నించారు. గాంధీ భవన్ వైపు వచ్చిన పలువురు బీజేవైఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి ఆఫీసుపై మరోసారి బీజేపీ శ్రేణులు దాడి చేశారు.
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంప్ ఆఫీసుపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసిన బీజేపీ నేతలు
మంత్రి కోమటిరెడ్డి దిష్టిబొమ్మను, క్యాంప్ ఆఫీసు దగ్గరున్న ఫ్లెక్సీని తగలబెట్టిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి
అనంతరం నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన… pic.twitter.com/EDjpExPsSK
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2026
సంబంధిత వార్తలు

Bathukamma Kunta | మళ్లీ బతుకమ్మ కుంట ఆక్రమణకు కుట్రలు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్
ఆగస్టు 31, 2026

Teenmar Mallanna | కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ఒట్టి బోగస్.. 1000 రోజుల పాలన అంతా అన్యాయమే
ఆగస్టు 31, 2026

Ponguleti Srinivas Reddy | భూ భారతితో సర్వే చేసి.. దశాబ్దాల భూసమస్యలను తీర్చి..
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●CM Revanth | ఒకే ఒక్కడు తెలంగాణను రూ.8.11లక్షల కోట్ల అప్పుల్లో ముంచిండు.. కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
- ●Aanasuya | జిమ్ వర్కవుట్ వీడియో పోస్ట్ చేసిన అనసూయ - కామెడీ పీస్ అంటూ నెటిజన్ల విమర్శలు
- ●Rats in Puri Temple | పూరీ జగన్నాథుడికీ తప్పని ఎలుకల బెడద.. గర్భగుడిలో పవిత్ర వస్త్రాలు ధ్వంసం, ఉచ్చు బిగించిన అధికారులు
- ●Bathukamma Kunta | మళ్లీ బతుకమ్మ కుంట ఆక్రమణకు కుట్రలు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్
- ●CM Revanth | అంబర్పేటలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తం : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
- ●Indus Waters Treaty | సింధు జలాల ఒప్పందం: హేగ్ కోర్టు తీర్పును తోసిపుచ్చిన భారత్.. మా నిర్ణయాలను ప్రశ్నించే హక్కు లేదని ఫైర్

CM Revanth | ఒకే ఒక్కడు తెలంగాణను రూ.8.11లక్షల కోట్ల అప్పుల్లో ముంచిండు.. కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్

Aanasuya | జిమ్ వర్కవుట్ వీడియో పోస్ట్ చేసిన అనసూయ - కామెడీ పీస్ అంటూ నెటిజన్ల విమర్శలు

Rats in Puri Temple | పూరీ జగన్నాథుడికీ తప్పని ఎలుకల బెడద.. గర్భగుడిలో పవిత్ర వస్త్రాలు ధ్వంసం, ఉచ్చు బిగించిన అధికారులు

Bathukamma Kunta | మళ్లీ బతుకమ్మ కుంట ఆక్రమణకు కుట్రలు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్




