Special Tour Packages | నాలుగు క్షేత్రాల దర్శనం.. స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించిన ఆర్టీసీ..!
Special Tour Packages | ప్రముఖ క్షేత్రాల దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇందుకోసం స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో గానుగాపూర్, పండరీపూర్, కొల్హాపూర్, తుల్జాపూర్ క్షేత్రాలను దర్శించుకునే వీలు కల్పిస్తోంది.
Special Tour Packages | ప్రముఖ క్షేత్రాల దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇందుకోసం స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో గానుగాపూర్, పండరీపూర్, కొల్హాపూర్, తుల్జాపూర్ క్షేత్రాలను దర్శించుకునే వీలు కల్పిస్తోంది. బీహెచ్ఈఎల్ డిపో నుంచి ప్రత్యేక సర్వీస్ నడిపించనున్నది. ఈ నెల 27 నుంచి మార్చి ఒకటి వరకు కొనసాగుతుంది.
ప్యాకేజీలో పర్యటన ఫిబ్రవరి 27న రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. బీహెచ్ఈఎల్ నుంచి బస్ ప్రారంభమవుతుంది. కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి మీదుగా వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు బస్ గనుగాపూర్ చేరుతుంది. అక్కడ అందరూ ఫ్రెషప్ అయ్యాక దత్తాత్రేయ స్వామి దర్శనానికి వెళ్తారు. అనంతరం ఉదయం 9 గంటలకు బస్ కొల్హాపూర్‌కు చేరుకుంటుంది.
సాయంత్రం 5 గంటలకు కొల్హాపూర్‌కు చేరాక అందరూ మహాలక్ష్మీ అమ్మవారి దర్శనాలు చేసుకుంటారు. దర్శనాల అనంతరం బస్ రాత్రి 8 గంటలకు కొల్హాపూర్ నుంచి పండరీపూర్ చేరుకుంటుంది. రాత్రి అక్కడే బస చేస్తారు. మార్చి ఒకటిన ఉదయం పండరీపూర్ విఠలేశ్వరస్వామి దర్శనాలు చేసుకుంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు తుల్జాపూర్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడికి చేరుకొని భవానీ అమ్మవారిని దర్శనాలకు వెళ్లాల్సి ఉంటుంది.
సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. రాత్రి 11 గంటలకు కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లికి చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. ఇక ప్యాకేజీ ధర రూ.3200గా నిర్ణయించారు. నాలుగు క్షేత్రాల దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న వారంతా టికెట్లు బుక్ చేసుకోవాలని డిపో అధికారులు కోరారు. వివరాలకు 90634 01072 నెంబర్‌లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






