Bhatti Vikramarka | ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి.. ప్రధానిని డిమాండ్ చేసిన డిప్యూటీ సీఎం
Bhatti Vikramarka | ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు చెందిన ఒక ప్రధాన సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
Bhatti Vikramarka | ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు చెందిన ఒక ప్రధాన సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట గ్రామంలోని పంతులుగారి తోటలో మంగళవారం బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి భూమిపూజ చేశారు.
అలాగే, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని 11 ప్రాంతాల్లో సుమారు రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి, రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో రైతులు పండించే ప్రతి పంటను కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు. వ్యవసాయ రంగంలో కొత్త మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పంట కోతల అనంతరం గడ్డిని కాల్చడం వల్ల పర్యావరణం దెబ్బతింటున్న నేపథ్యంలో, దానిని బయోగ్యాస్ ఉత్పత్తికి వినియోగించే విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ఈ విధానం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఆయన అన్నారు. పంట మార్పిడి విధానాన్ని రైతులు తప్పనిసరిగా అనుసరించాలని సూచించిన ఆయన, వరి పంటపై మాత్రమే ఆధారపడకుండా ఉద్యానవన పంటలు, చిరుధాన్యాలు, ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆధునిక సాగు పద్ధతులతోనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, డీఎస్పీ నాగేంద్రాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్ మల్లుగారి పద్మ తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






