త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC | భ‌క్తుల ఇంటికే భ‌ద్రాద్రి త‌లంబ్రాలు..

TGSRTC | మార్చి 27న శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా భ‌ద్రాచ‌లంలో జ‌ర‌గ‌బోయే శ్రీ సీతారామచంద్రుల క‌ల్యాణోత్స‌వ త‌లంబ్రాల‌ను భ‌క్తుల చెంత‌కే తీసుకురావాల‌ని టీజీఎస్ ఆర్టీసీ యాజ‌మాన్యం నిర్ణ‌యం తీసుకుంది.

S

Telangana | Published On Feb 21, 2026, 6.01 pm IST

TGSRTC | భ‌క్తుల ఇంటికే భ‌ద్రాద్రి త‌లంబ్రాలు..
Advertisement

రూ. 151 చెల్లిస్తే రాములోరి త‌లంబ్రాలు మీ చెంతకు
ఈ నెల 23 నుంచి బుకింగ్స్ ప్రారంభం
గోడ ప‌త్రిక‌ను ఆవిష్క‌రించిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

TGSRTC | త్రినేత్ర‌.న్యూస్ : మార్చి 27న శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా భ‌ద్రాచ‌లంలో జ‌ర‌గ‌బోయే శ్రీ సీతారామచంద్రుల క‌ల్యాణోత్స‌వ త‌లంబ్రాల‌ను భ‌క్తుల చెంత‌కే తీసుకురావాల‌ని టీజీఎస్ ఆర్టీసీ యాజ‌మాన్యం నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలో గ‌తేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ స‌హ‌కారంతో రాములోరి క‌ల్యాణ త‌లంబ్రాల‌ను భ‌క్తుల ఇంటి వ‌ద్ద‌కు చేర‌వేసే ప‌విత్ర కార్య‌క్ర‌మానికి టీజీఎస్ ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.

రాములోకి క‌ల్యాణ త‌లంబ్రాల బుకింగ్‌కు సంబంధించిన గోడ‌ప‌త్రిక‌ను హైద‌రాబాద్‌లోని బ‌స్ భ‌వ‌న్‌లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి శ‌నివారం ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని మూడేళ్ళ క్రితమే టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకుంటున్నారు. 2022లో దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను బుక్ చేసుకోగా.. గత మూడేళ్ళలో లక్షలాది మంది భక్తులకు తలంబ్రాలను సంస్థ అందజేసిందని తెలిపారు.

శ్రీ సీతారామ‌చంద్ర‌లు క‌ల్యాణ త‌లంబ్రాల‌ను పొందాల‌నుకునే భ‌క్తులు www.tgsrtclogistics.co.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుంది. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040-23450033, 040-69440069 లలో సంప్రదించవచ్చు.

Advertisement
Advertisement