త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | సింగ‌రేణిని ఏటీఎంగా మార్చుకున్న కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌: కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్‌

Bandi Sanjay | సింగ‌రేణి (Singareni) సంస్థ‌ను బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లు ఏటీఎంలుగా మార్చుకున్నాయ‌ని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) ఆరోపించారు. సంస్థ విష‌యంలో రెండు పార్టీలు తోడు దొంగ‌ల్లాగా వ్య‌వ‌హిస్తున్నాయ‌ని విమ‌ర్శించారు.

G

Telangana | Published On Jan 24, 2026, 7.12 pm IST

Bandi Sanjay | సింగ‌రేణిని ఏటీఎంగా మార్చుకున్న కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌: కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: సింగ‌రేణి (Singareni) సంస్థ‌ను బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లు ఏటీఎంలుగా మార్చుకున్నాయ‌ని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) ఆరోపించారు. సంస్థ విష‌యంలో రెండు పార్టీలు తోడు దొంగ‌ల్లాగా వ్య‌వ‌హిస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. సింగ‌రేణి న‌ష్టాల‌కు కార‌కులు ఎవ‌ర‌ని, అస‌లు దొంగ‌లు ఎవ‌ర‌ని ప్ర‌శ్నించారు.

`సింగరేణి ఫైల్స్‌ తారుమారయ్యే అవ‌కాశం ఉంది. సింగరేణలో కొంతమంది అధికారులు ఇప్ప‌టికీ బీఆర్‌ఎస్‌ కంట్రోల్‌లో ఉన్నారు. కంపెనీకి సంబంధించిన ఫైల్స్‌ను వెంటనే సీజ్‌ చేయాలి. రెండు పార్టీలు సింగరేణిని ఏటీఎమ్‌గా మార్చుకున్నాయి. అధికారిని బదిలీ చేయాలని కోరినా అప్పటి ముఖ్యమంత్రి చేయలేదు. సింగరేణి వల్ల పాలకులకు, కాంట్రాక్టర్లకు లాభం జరుగుతోంది. సంస్థ‌కు మాత్రం నష్టం జరుగుతుంది. సింగరేణిలో కేసీఆర్ కుటుంబం అంతా దోచుకుంది. పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్లుగా కార్మికుల పరిస్థితి మారింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల‌ను కార్మికులు చీదరించుకుంటున్నారు. సింగరేణిని కాపాడేది కేవలం కేంద్ర ప్రభుత్వమేన‌ని అంటున్నారు. సింగరేణి వ్య‌వ‌హారాల‌పై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కమిటీ వేశారు. నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడదాం’ అని బండి సంజ‌య్ అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement