Bandi Sai Bhagirath & Pocso case| అవును.. ఆ అమ్మాయి..నేను ఇద్దరం కలిసే తిరిగాం..
3 వ సారి ప్రధానమంత్రి (Prime Minister) అయిన తర్వాత నరేంద్రమోదీ (Narendra Modi) తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ (Telangana) బీజేపీలో (BJP) ఓ సంచలనం నమోదైంది. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడైన బండి సాయి భగీరథ్(Bandi Sai Bhagirath) పై పోక్సో (POCSO) కేసు నమోదైంది. బండి సాయి భగీరథ్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ బాలిక (Minor girl) పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సంక్షిప్త సారాంశం
ఆ అమ్మాయి నాకు తెలుసు. మా ఇద్దరి మధ్య స్నేహం ఉంది. మరో కామన్ ఫ్రెండ్ ద్వారా ఆమె నాకు పరిచయమైంది. సోషల్ అసోసియేషన్ ఉంది. ఇద్దరం సరదాగా ట్రిప్పులకూ వెళ్లాం. మరికొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి విజయవాడ గుడి, అరుణాచలం, తిరుమల వెళ్లి దైవదర్శనం చేసుకున్నాం. మంచివాళ్లనుకొని వాళ్లతో రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేశాను. కానీ ఆ తర్వాత వాళ్లు నన్ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. 5 కోట్లు ఇవ్వకపోతే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది.... అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ..కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అవును.. ఇద్దరం కలిసి తిరిగాం
ఆమె నా ఫ్రెండ్
ఆమెతో స్నేహం పెరిగింది
వాళ్ల ఇంట్లో
ఫంక్షన్లకు కూడా వెళ్లాను
సరదాగా.. ట్రిప్పులకూ వెళ్లాం
ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని
వాళ్ల తల్లిదండ్రులు బ్లాక్ మెయిల్ చేశారు
భయపడి 50 వేలు ఇచ్చాను
5 కోట్లు డిమాండ్ చేశారు
లేదంటే ఆ అమ్మాయి చనిపోతానంది
నన్ను బ్లాక్ మెయిల్ చేశారు
కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన
బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్
త్రినేత్ర.న్యూస్: తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో కేంద్ర హోం శాఖ (Home ministry) సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి సాయి భగీరథ్ (Bandi Sai Bhagirath) పై హైదరాబాద్ నగరంలోని పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పోక్సో (POCSO) కేసు నమోదైంది. అయితే తాను ఎవరినీ వేధించలేదని తననే సదరు అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారంటూ.. బండి సాయి భగీరథ్ శుక్రవారం (2026 మే 8) సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేట బషీరాబాద్ లో పోక్సో(POCSO) కేసు నమోదయ్యేకన్నా.. కొన్ని గంటల ముందే కరీంనగర్ లో ఈ కేసు నమోదు కావడం గమనార్హం. ఇంతకీ ఆ ఫిర్యాదులో ఏముందంటే...
అవును.. ఇద్దరం కలిసి తిరిగాం
(పోక్సో కేసు నిబంధనల ప్రకారం.. బాలిక పేరు బయటపెట్టడం శిక్షార్హం. కాబట్టి ఇక్కడ ఆ అమ్మాయి పేరు రాయడం లేదు).
నాకో కామన్ ఫ్రెండ్ ద్వారా ఆ అమ్మాయి పరిచయమైంది. సమాజంలో మంచి పేరున్న వాళ్లు కాబట్టి నేను కూడా వారితో సోషల్ గా మూవ్ అయ్యాను. ఫ్రెండ్లీ రిలేషన్ కొనసాగించాం. నేను వాళ్ల ఇంట్లో ఫంక్షన్లకు కూడా వెళుతుండేవాడిని. గ్రూప్ గ్యాదరింగ్స్ కు పిలిచేవాళ్లు. నాకు నమ్మకం కలిగించేలా ఆధ్యాత్మిక ప్రదేశాలైన విజయవాడ, అరుణాచలం, తిరుమల వంటి ప్రదేశాలకు ట్రిప్పులకు నన్ను ఆహ్వానించేవాళ్లు. నేను కూడా ఆ ట్రిప్పులకు ఆ అమ్మాయితో కలిసే వెళ్లాను.
5 కోట్లు డిమాండ్ చేశారు
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. మెలమెల్లగా వారి ప్రవర్తనలో మార్పులొచ్చాయి. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు నాపై ఒత్తిడి తీసుకొచ్చారు. నేను తిరస్కరించేసరికి నాపై తప్పుడు కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. డబ్బులివ్వమని కూడా బెదిరించేవారు. నేను కూడా వాళ్ల మాటలకు భయపడి ఆ అమ్మాయి తండ్రికి 50వేలు ఇచ్చాను. ఇక నన్ను వదిలిపెట్టమని వారిని బతిమిలాడాను. అయినా వినలేదు. నన్ను 5 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే.. తాను చనిపోతానని ఆ అమ్మాయి తల్లి నన్ను బెదిరించింది. నా ఫ్రెండ్స్ తో కూడా ఆ అమ్మాయి ఇలాగే వ్యవహరిస్తే.. నిర్మల్ పోలీస్ స్టేషన్ లో 2026 ఏప్రిల్ 21న ఆ అమ్మాయిపై ఎఫ్ ఐ ఆర్ నమోదైంది.


ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ






