త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asha Workers | రేవంత్ రెడ్డి ఆశాల చావు కోరుతున్నాడు..

Asha Workers | రాష్ట్రంలోని ఆశా వ‌ర్క‌ర్లు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మండిప‌డుతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు కాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆశా వ‌ర్క‌ర్ల‌ను కేసీఆర్ కంటికి రెప్ప‌లా కాపాడుకుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం ఆశాల చావు కోరుతున్నాడ‌ని క‌న్నీరు పెట్టుకున్నారు.

S

Telangana | Published On Nov 12, 2026, 5.38 pm IST

Asha Workers | రేవంత్ రెడ్డి ఆశాల చావు కోరుతున్నాడు..
Advertisement

జ‌గ‌దీశ్ రెడ్డి ఎదుట క‌న్నీరు పెట్టుకున్న ఆశా వ‌ర్క‌ర్లు

Asha Workers | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలోని ఆశా వ‌ర్క‌ర్లు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మండిప‌డుతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు కాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆశా వ‌ర్క‌ర్ల‌ను కేసీఆర్ కంటికి రెప్ప‌లా కాపాడుకుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం ఆశాల చావు కోరుతున్నాడ‌ని క‌న్నీరు పెట్టుకున్నారు. సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డికి ఆశా వ‌ర్క‌ర్లు త‌మ స‌మస్య‌ల‌ను విన్న‌వించుకుని బోరున విల‌పించారు.

జీతాలు సక్కగ ఇవ్వడం చేతకాదు.. కానీ యాక్సిడెంట్ బీమా మాకెందుకు అని ఆశాలు ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. త‌మ డిమాండ్ల సాధ‌న‌కై ఈ నెల 15 నుంచి నిర‌వ‌ధిక స‌మ్మె నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. హామీలు అమ‌ల‌య్యేంత వ‌ర‌కు స‌మ్మె విర‌మించే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చిచెప్పారు. మా స‌మ్మెకు మ‌ద్ద‌తిచ్చి ఆశాల‌కు అండ‌గా నిల‌వండి అని జ‌గ‌దీశ్ రెడ్డిని కోరారు.

Advertisement
Advertisement