ASHA Workers | జీతాల కోసం ఆశా వర్కర్ల ధర్నా.. ఈడ్చుకెళ్లిన పోలీసులు
ASHA Workers | ఆశా వర్కర్లు మరోసారి పోరుబాట పట్టారు. మూడు నెలల నుంచి జీతాల్లేక అల్లాడిపోతున్నామని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మూడు నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోఠిలోని డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు.
ASHA Workers | త్రినేత్ర.న్యూస్ : ఆశా వర్కర్లు మరోసారి పోరుబాట పట్టారు. మూడు నెలల నుంచి జీతాల్లేక అల్లాడిపోతున్నామని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మూడు నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోఠిలోని డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు.
రూ. 18 వేలు కనీసం వేతనం, ఆశాలకు కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1500 పారితోషికాలను వెంటనే అమలు చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సంక్షేమం కోసం ఈ బడ్జెట్‌లో నిధులు పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పోలీసుల అత్యుత్సాహం..
శాంతియుతంగా ధర్నా చేపట్టిన ఆశా వర్కర్ల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నిరసన వ్యక్తం చేస్తున్న ఆశాలకు ఆటంకం కల్పించారు. నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లి.. బలవంతంగా పోలీసు వ్యాన్లలో ఎక్కించారు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ఆశాలు.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని, లేదంటే ఆందోళనలు తప్పవని ఆశాలు హెచ్చరించారు.
స్పృహ తప్పిన ఆశా వర్కర్
పోలీసుల తోపులాటలో ఓ ఆశా వర్కర్ స్పృహతప్పి పడిపోయారు. అప్రమత్తమైన తోటి ఆశాలు.. ఆమెకు సేవలు చేశారు. అనంతరం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పోలీసుల తీరుపై ఆశాలు మండిపడ్డారు.
https://x.com/TeluguScribe/status/2025836741777875359
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



