త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

APSRTC | ఆర్టీసీ డ్రైవ‌ర్‌కు గుండెపోటు.. 19 మంది ప్ర‌యాణికులు సేఫ్‌

APSRTC | డ్రైవింగ్ చేస్తుండ‌గానే ఓ డ్రైవ‌ర్ సీటులో కుప్ప‌కూలిపోయాడు. ఈ ఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని చౌటుప్ప‌ల్ వ‌ద్ద చోటు చేసుకుంది.

S

Telangana | Published On Jan 26, 2026, 5.43 pm IST

APSRTC | ఆర్టీసీ డ్రైవ‌ర్‌కు గుండెపోటు.. 19 మంది ప్ర‌యాణికులు సేఫ్‌
Advertisement

APSRTC | త్రినేత్ర‌.న్యూస్ : డ్రైవింగ్ చేస్తుండ‌గానే ఓ డ్రైవ‌ర్ సీటులో కుప్ప‌కూలిపోయాడు. ఈ ఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని చౌటుప్ప‌ల్ వ‌ద్ద చోటు చేసుకుంది. హైద‌రాబాద్‌లోని మియాపూర్ నుంచి విజ‌య‌వాడ‌కు ఏపీఎస్ఆర్టీసీ బ‌స్సు సోమ‌వారం మ‌ధ్యాహ్నం బ‌య‌ల్దేరింది. చౌటుప్ప‌ల్ వ‌ద్ద‌కు రాగానే డ్రైవ‌ర్‌కు ఛాతీలో నొప్పిగా అనిపించ‌డంతో.. బస్సును వెంట‌నే ఆపేశాడు. క్ష‌ణాల్లోనే డ్రైవింగ్ సీటులోనే కుప్పకూలిపోయాడు.

గ‌మ‌నించిన ప్ర‌యాణికులు, స్థానికులు క‌లిసి హుటాహుటిన ఆటోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు ఆస్ప‌త్రికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని విజ‌య‌వాడ డిపోలో ప‌ని చేస్తున్న గొల్ల‌పూడికి చెందిన నాగ‌రాజు(38)గా పోలీసులు గుర్తించారు. బ‌స్సులోని 19 మంది ప్ర‌యాణికులు సుర‌క్షితంగా ఉన్నారు. ప్ర‌యాణికుల‌ను వేరే బ‌స్సులో విజ‌య‌వాడ‌కు పంపించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement