Secunderabad Railway Station | శరవేగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు.. ఇప్పటికే 64శాతం పూర్తి
Secunderabad Railway Station | దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అమృత్ భారత్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికే 64శాతం పనులు పూర్తయ్యాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
Secunderabad Railway Station | దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అమృత్ భారత్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికే 64శాతం పనులు పూర్తయ్యాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. రూ.714.73 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. రోజుకు సుమారు 180 రైళ్లు రాకపోకలు సాగించే ఈ స్టేషన్ ద్వారా సగటున 1.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలను విస్తరించేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా, రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా దశలవారీగా పనులు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు.
అత్యాధునిక సదుపాయాలతో కొత్త రూపు

పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాక సికిందరాబాద్ రైల్వేస్టేషన్ పూర్తిగా కొత్త రూపును సంతరించుకోనున్నది. స్టేషన్ భవనాలు, రెండు అంతస్తుల ఎయిర్ కాన్‌కోర్స్, ప్లాట్‌ఫారాలపై పూర్తి స్థాయి రూఫ్ కవరింగ్, బహుళ అంతస్తుల పార్కింగ్ సదుపాయాలు, 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే, ప్రత్యేక స్కైవాక్‌ల ద్వారా మెట్రో స్టేషన్లకు అనుసంధానం, ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలు, సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సదుపాయాలు, అత్యాధునిక సీసీటీవీ నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే తాత్కాలిక టికెట్ బుకింగ్ కార్యాలయం, రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్) భవనం, కాజీపేట వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి, సౌత్ వైపు అప్రోచ్ రోడ్డు నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

నిర్మాణ దశలో కీలక ప్రాజెక్టులు..
ప్రస్తుతం దక్షిణ వైపు బేస్‌మెంట్, అరైవల్ ఏరియా, స్టేషన్ భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఉత్తరం వైపు స్టేషన్ భవనం, మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే, ఎయిర్ కాన్‌కోర్స్, ప్లాట్‌ఫారం కవరింగ్ పనులు, హైదరాబాద్ వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ట్రావెలేటర్లతో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, భూగర్భ జలాశయాలు, ఎస్‌టీపీ, సికింద్రాబాద్ ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లను అనుసంధానించే స్కైవాక్‌ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. స్టేషన్ పనులు పూర్తయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తెలంగాణ రైల్వేకు ఎంట్రెన్స్ గేట్‌గా మారనుంది. రైల్వే, మెట్రో, రోడ్డు రవాణా వ్యవస్థల మధ్య మెరుగైన అనుసంధానం ఏర్పడి ప్రయాణీలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం అందుబాటులోకి రానుంది.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
ఆగస్టు 4, 2026

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
ఆగస్టు 4, 2026

Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!
- ●Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
- ●Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!
- ●Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం

Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం

TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!

Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం



