BRS Women Wing | అమ్మా.. మీ భక్తుడు బండి సంజయ్ తప్పు చేశాడు.. శిక్షించు: భాగ్యలక్ష్మి అమ్మవారిని వేడుకున్న బీఆర్ఎస్ మహిళా నేతలు
BRS Women Wing | మీ భక్తుడు అయిన బండి సంజయ్ నేరాలకు ఒడిగడుతున్నాడని, ఆయనకు సద్బుద్దినిచ్చేలా ఆశీర్వదించాలని బీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నారు. బండి సంజయ్ తనంతట తానే తన పదవికి రాజీనామా చేసేలా దీవించాలని కోరుకున్నామని చెప్పారు.
- నేరాలకు ఒడిగడుతున్నడు
- ఆయనకు సద్బుద్దినివ్వు
- తనంతట తానే పదవికి రాజీనామా చేసేలా ఆశీర్వదించు
- చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
BRS Women Wing | త్రినేత్ర.న్యూస్: మీ భక్తుడు అయిన బండి సంజయ్ నేరాలకు ఒడిగడుతున్నాడని, ఆయనకు సద్బుద్దినిచ్చేలా ఆశీర్వదించాలని బీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నారు. ఈమేరకు వారు సోమవారం ఉదయం ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండి సంజయ్ తనంతట తానే తన పదవికి రాజీనామా చేసేలా దీవించాలని కోరుకున్నామని చెప్పారు.

మీరు పదవిలో ఉంటే కేసు నీరుగారిపోతది..
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత మీద ఏ సవాల్ విసరాలన్నా తడి బట్టలతో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకొస్తాను.. మీరు వస్తారా అని బండి సంజయ్ ఇక్కడికొచ్చి సవాల్ విసురుతడు. ఈరోజు మేం ఇక్కడికి రావడం కూడా మీ పుణ్యమే బండి సంజయ్. ఇప్పుడు మేం కూడా సవాల్ చేస్తున్నం. అమ్మవారిని ఒకటే కోరుకున్నం. మీరు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రిగా ఉండడం వల్లే బండి భగీరథ్‌ను వారం రోజుల పాటు అరెస్టు చేయకుండా కాపాడారు. ఇదే పదవిలో మీరు ఇంకా కొనసాగుతుంటే ఈ కేసు నీరుగారిపోతది. ఈ ఆలోచన ప్రజలల్లో బాగా ఉన్నది.
మీకు మీరే వైదొలగండి అని హితవు పలికారు.
రాజీనామా చేస్తే దేశం మొత్తం గర్విస్తది..
బండి సంజయ్.. మీకు మీరే బాధ్యత వహించి మీ పదవికి రాజీనామా చేస్తే రాష్ట్రమే కాదు దేశం మొత్తం గర్విస్తది. అలాంటి సద్బుద్దినివ్వాలని అమ్మవారిని కోరుకోవడానికి వచ్చాం. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా అమ్మవారు ఆశీర్వదించాలని. అమ్మవారిని నమ్ముకొని తప్పులు చేసేవారిని శిక్షించాలని కోరుకున్నం అని గొంగడి సునీత
బాలికను బెదిరించారు: తుల ఉమా
బండి ఏ పని చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బండి సంజయ్ ఇక్కడికి వస్తరు. అమ్మవారి భక్తుడైన బండి సంజయ్ తన కొడుకును కాపాడే ప్రయత్నం చేశాడు. బాధిత బాలికను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి, భయభ్రాంతులకు గురిచేశారు. నేను కేంద్ర మంత్రిని కదా ఏం చేసినా నడుస్తది అనే ధోరణిలో ఉన్నడు. పోలీసులు కూడా నిందితుడిని అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం చేశారు. తొమ్మిది రోజుల తర్వాత అరెస్టు చేసినా శిక్ష పడకుండా బండి సంజయ్ ప్రయత్నం చేస్తారు. అమ్మా.. మీ భక్తుడు ఇట్లాంటి నేరాలకు ఒడిగడుతున్నడు. కాబట్టి ఆ నేరస్థున్ని తనంతట తానే తన పదవి నుంచి వైదొలగేలా ఆశీర్వదించండి.
మోదీవి మాటలే.. చేతలు కావు..
మోదీకి గూడా విజ్ఞప్తి చేస్తున్నం. బేటీ పడావో, బేటీ బచావో అని నినాదాలు ఇస్తరు. మరి ఇవి మాటలేనా? చేతల్లో ఉండవా? తన కొడుకు తప్పు చేస్తే కాపాడడానికి కేంద్ర మంత్రి శథవిదాలా ప్రయత్నం చేసిండు. ఆ నేరానికి పాల్పడ్డవాళ్లను తప్పించడానికి ప్రయత్నం చేసిన బండి సంజయ్ కూడా నేరస్థుడే అవుతాడు. ఆయన్ను కూడా కస్టడీలోకి తీసుకోవాలి. తక్షణమే ఆయన్ను బర్తరఫ్ చేయాలి. నేరానికి తగిన శిక్ష పడాలి. దీని కోసమే ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి మహిళా విభాగం ఆధ్వర్యంలో వచ్చినం. నేరస్థులకు శిక్ష పడేలా పూజలు నిర్వహించాం అని మహిళా నేతలు చెప్పారు.
అమ్మవారు ఎంత పెద్దవారినైనా శిక్షిస్తది..
తన కొడుకును ఇక్కడికి పచ్చిబట్టలతోటి తీసుకురావాలని సవాల్ చేసినం. అమ్మవారు ఎంత పెద్దవారికైనా శిక్ష వేస్తది. బండి భగీరథ్ అరెస్టు అయినందుకు అమ్మవారికి ధన్యవాదాలు చెప్పాం. ఈ కేసు ముందుకు పోవాలి. పోక్సో కేసు ఎన్నో ముసుగులను తొలగించింది. కాంగ్రెస్, బీజేపీ ఒకటే. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయకపోవడమే ఇందుకు కారణం. పేదోళ్లు తప్పు చేస్తే ఎన్‌కౌంటర్ చేస్తరు. మరి పెద్దోళ్లు తప్పు చేస్తే కాపాడడం ఎందుకు? రేవంత్‌రెడ్డి ఈ కేసును సీరియస్‌గా తీసుకోనందుకు బాధేస్తుంది అని బీఆర్ఎస్ మహిళా నేతలు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



