ఎత్తులు.. పొత్తులు.. చేరికలు
పీఠం దక్కాలి. అధికారం పొందాలి. అందుకోసం సామ దాన భేద దండోపాయాలు పాటించాలి. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమైనా సరే చైర్మన్ గిరి కోసం అవసరమైతే ప్రత్యర్థి పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలి- ఈ వ్యూహంతో అధికార పార్టీ కాంగ్రెస్ అనుకున్నది అనుకున్నట్టుగా హంగ్ ఏర్పడిన స్థానాలన్నింటినీ కైవసం చేసుకునే కసరత్తులో దాదాపుగా విజయం సాధించింది.
- 87 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లు హస్తగతం
- 17 మున్సిపాలిటీలతో సరిపెట్టుకున్న బీఆర్ఎస్
- బీజేపీకి ఒక కార్పొరేషన్‌తో పాటు మరో మున్సిపాలిటీ
- కొత్తగూడెం కార్పొరేషన్ సీపీఐకే
- హంగ్ వచ్చిన పట్టణాల్లో పీఠాలు దక్కించుకున్న కాంగ్రెస్
- కొన్ని చోట్ల ఎక్స్ అఫీషియో ఎత్తులు
- మరికొన్ని చోట్ల బీజేపీతో పొత్తులు
- ఇంకొన్ని చోట్ల ప్రత్యర్థి పార్టీల నుంచి చేరికలు
- ఉదయం నుంచి అనేకచోట్ల హైడ్రామా
- ఉద్రిక్తతలు, ఆందోళనల నడుమ 11 చోట్ల ఎన్నిక వాయిదా
త్రినేత్ర.న్యూస్: పీఠం దక్కాలి. అధికారం పొందాలి. అందుకోసం సామ దాన భేద దండోపాయాలు పాటించాలి. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమైనా సరే చైర్మన్ గిరి కోసం అవసరమైతే ప్రత్యర్థి పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలి- ఈ వ్యూహంతో అధికార పార్టీ కాంగ్రెస్ అనుకున్నది అనుకున్నట్టుగా హంగ్ ఏర్పడిన స్థానాలన్నింటినీ కైవసం చేసుకునే కసరత్తులో దాదాపుగా విజయం సాధించింది. 66 మున్సిపాలిటీల్లో మాత్రమే అత్యధిక స్థానాలు గెలిచినా తన వ్యూహ చతురతతో మరో 21 స్థానాలు కలుపుకొని మొత్తం 87 పట్టణాల్లో పుర పీఠాన్ని దక్కించుకున్నది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ 13 మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు గెలిచినప్పటికీ స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో మొత్తం 17 పుర పీఠాలను చేజిక్కించుకున్నది. అనేక ఉద్రిక్తతల నడుమ ఆందోళనలు జరగగా 11 చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.
అనూహ్య పొత్తులు
ఆమన్‌గల్ మున్సిపాలిటీలో 16 వార్డుల్లో పోటీ జరగగా అక్కడ బీఆర్ ఎస్ 8 వార్డుల్లో గెలిచింది. ఒక చోట కాంగ్రెస్, మరో 6 చోట్ల బీజేపీ గెలుపొందింది. తీరా చైర్మన్ ఎన్నిక జరిగే సమయానికి కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పి బీఆర్ ఎస్ అభ్యర్థిని తమ పార్టీలో చేర్చుకొని చైర్మన్ పదవి ఇచ్చింది. బీజేపీ మద్దతుతో పీఠం దక్కించుకున్నది. ఇటువంటి పరిస్థితి అనేక చోట్ల నెలకొన్నది. తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు ఎక్స్ అఫీషియో అస్త్రం ప్రయోగించింది. దీంతో అక్కడ రణరంగమై ఎన్నిక వాయిదా పడింది.
5 కార్పొరేషన్లు హస్తానివే..
కాంగ్రెస్ పార్టీ అమలు చేసి క్యాంపు రాజకీయాలు సత్ఫలితాన్నిచ్చాయి. ఆ పార్టీకి మంచిర్యాల, రామగుండం, నల్లగొండలో అత్యధిక స్థానాలతో మెజారిటీ రాగా మరో 2 స్థానాలైన నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ఎంఐఎం మద్దతుతో పీఠాలు దక్కించుకున్నది. కాగా కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ దక్కించుకోగా కొత్తగూడెం లో సీపీఐ పాగా వేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



