All India Breakdown | నేడు క్యాబ్ డ్రైవర్ల స్ట్రైక్.. ప్రజలకు తప్పని ఇబ్బందులు!
All India Breakdown | దేశ వ్యాప్తంగా యాప్ ఆధారిత రవాణా సేవలు (Drivers Strike) నిలిచిపోనున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ అంతంత మాత్రంగా ఉండటంతో ఓలా (OLA), ఊబర్ (Uber), ర్యాపిడో (Rapido) వంటి రైడ్ ఆధారిత రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లు (Raid Hailing Platforms) ప్రస్తుతం రోడ్డు రవాణాకు అత్యంతక కీలకంగా మారాయి.
All India Breakdown | త్రినేత్ర.న్యూస్: దేశ వ్యాప్తంగా యాప్ ఆధారిత రవాణా సేవలు (Drivers Strike) నిలిచిపోనున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ అంతంత మాత్రంగా ఉండటంతో ఓలా (OLA), ఊబర్ (Uber), ర్యాపిడో (Rapido) వంటి రైడ్ ఆధారిత రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లు (Raid Hailing Platforms) ప్రస్తుతం రోడ్డు రవాణాకు అత్యంతక కీలకంగా మారాయి. అయితే ఈ సంస్థలు తమ శారీరక శ్రమను దోచుకుంటున్నారని, ఏకపక్షంగా చార్జీలు నిర్ణయించి తమను దోపిడీ చేస్తున్నాయని డ్రైవర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. తమ పరిస్థితులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని, దీనికి నిరసనగా ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్ (All India Breakdown) పేరుతో తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) తో పాటు ఇతర జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.
దీంతో హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రజలకు తిప్పలు తప్పేలా లేవు. అసలే భాగ్యనగరంలో ఆర్టీసీ బస్సులు అంతంత మాత్రమే. ఆపై ఉచిత టికెట్ వల్ల మహిళలతోనే బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో శనివారం ఆఫీసులు, కాలేజీలకు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు వ్యక్తిగత వాహనాలు ఆశ్రయించే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత రవాణా కార్మికులు ఫిబ్రవరి 7న ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్ పాటిస్తారని టీజీపీడబ్ల్యూయూ తెలిపింది. కనీస ఛార్జీలు లేవని, నియంత్రణ లేదని, అంతులేని దోపిడీ సాగుతున్నదని పేర్కొంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస చార్జీలు నిర్ణయించడంలో విఫలమయ్యాయని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ప్లాట్‌ఫామ్‌లు తమ ఆదాయాన్ని దోచుకోవడంతో తీవ్రమైన భారం పడుతున్నదని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ఖర్చులు పెరుగుతుండటం, వాహనాల నిర్వహణ, ఇన్సూరెన్స్ ఖర్చులను డ్రైవర్లపైనే కంపెనీలు వేస్తున్నాయని, దీంతో అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం మినిమమ్ బేస్ చార్జీలను నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. యాప్ ఆధారిత డ్రైవర్లు పేదరికంలోకి జారుకుంటుంటే అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లు లాభాలు గడిస్తున్నాయని పేర్కొన్నారు.
డ్రైవర్ల డిమాండ్లు ఇవే..
ఆటోలు, క్యాబ్‌లు, బైక్ టాక్సీలు, ఇతర అగ్రిగేటర్ ఆధారిత సేవలతో పాటు యాప్ ఆధారిత రవాణా సేవల కోసం కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే 'కనీస బేస్ చార్జీలను నిర్ణయించి నోటిఫికేషన్ ఇవ్వాలి. మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2025 ప్రకారం గుర్తింపు పొందిన డ్రైవర్, కార్మిక సంఘాలతో సంప్రదించిన తర్వాత ఈ చార్జీలను ఖరారు చేయాలి. వాణిజ్య ప్రయాణికులు, వస్తువుల రవాణా కోసం ప్రైవేట్, నాన్-కమర్షియల్ వాహనాల వాడకాన్ని నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ola S1 X Plus 5.2 kWh | ఒక్కసారి చార్జ్ చేస్తే 320 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల..
ఏప్రిల్ 14, 2026

Hyderabad | ఆత్మహత్యకు లోకేషన్ ఎంచుకుంది..! ర్యాపిడో ఎక్కింది..!!
ఫిబ్రవరి 3, 2026

Bike Taxis | బైక్ టాక్సీలకు ఓకే చెప్పిన కర్ణాటక హైకోర్టు.. బెంగళూరులో నిషేధం ఎత్తివేత..
జనవరి 23, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



