Hyderabad | ఆత్మహత్యకు లోకేషన్ ఎంచుకుంది..! ర్యాపిడో ఎక్కింది..!!
Hyderabad | తల్లిని భారంగా భావించే ఈ రోజుల్లో ఓ బిడ్డ తన తల్లి కోసం తల్లడిల్లింది. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తన తల్లి ఒంటరి అవుతుందని భావించింది ఆ బిడ్డ. కానీ క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం.. చివరకు తల్లిని అనాథను చేసింది. తన ఆత్మహత్యకు లోకేషన్‌ను ఎంచుకుని, ర్యాపిడో ఎక్కింది.. ఇంటి నుంచి బయల్దేరిన రెండు రోజుల తర్వాత హుస్సేస్ సాగర్‌లో శవమై తేలియాడింది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : తల్లిని భారంగా భావించే ఈ రోజుల్లో ఓ బిడ్డ తన తల్లి కోసం తల్లడిల్లింది. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే మతిస్థిమితం లేని తల్లి ఒంటరి అవుతుందని భావించింది ఆ బిడ్డ. కానీ క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం.. చివరకు తల్లిని అనాథను చేసింది. తన ఆత్మహత్యకు లోకేషన్‌ను ఎంచుకుని, ర్యాపిడో ఎక్కింది.. ఇంటి నుంచి బయల్దేరిన రెండు రోజుల తర్వాత హుస్సేస్ సాగర్‌లో శవమై తేలియాడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిర్మల్ జిల్లాలోని భైంసాకు చెందిన విజయలక్ష్మీ అనే యువతి హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. ఇక తన తల్లితో కలిసి కూకట్‌పల్లి పరిధిలోని మైత్రినగర్‌లో నివాసం ఉంటుంది. తన చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లికి మతిస్థిమితం లేదు. దీంతో అన్నీతానై చూసుకుంటోంది విజయలక్ష్మి.
ఆ ఒక్క కండీషన్‌తోనే..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న విజయలక్ష్మీకి పెళ్లి వయసు వచ్చింది. దీంతో ఆమె పెద్దనాన్న కుమారులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అయితే తను ఒక్కతే కుమార్తె కావడంతో.. పెళ్లి చేసుకుని వెళ్లిపోతే.. మతిస్థిమితం లేని తన తల్లికి ఎవరు సేవలు చేస్తారని మదనపడింది. దాంతో తనకు పెళ్లాయ్యక తల్లి కూడా తనతో పాటే ఉండాలనే కండీషన్ పెట్టింది. ఈ కండీషన్ వల్ల చాలా సంబంధాలు కుదరలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. తనకు పెళ్లయ్యే యోగ్యం లేదనుకుని మనోవేదన చెందినట్లు ఉంది.
చావే పరిష్కారమనుకుని..
పెళ్లి వయసు రావడం ఒక ఎత్తు అయితే.. తాను పెట్టిన కండీషన్‌కు ఏ ఒక్కరూ కూడా ఒప్పుకోకపోవడంతో మరింత మానసిక వేదనకు గురైనట్లుంది. చివరకు చావే పరిష్కారమనుకుని భావించినట్లుంది. మతిస్థిమితంతో బాధపడుతున్న తల్లిని చూసి తల్లడిల్లిపోతూ.. మనసులోనే బాధను దిగమింగుకుంది. అయినా కూడా ఆమెను అవే ఆలోచనలు వెంటాడినట్లు ఉన్నాయి.
ర్యాపిడో బుక్ చేసుకుని..
తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన విజయలక్ష్మి జనవరి 31న ఇంట్లో నుంచి బయల్దేరింది. రెండు రోజుల్లో తిరిగి వస్తానని తల్లికి చెప్పింది. ఇక ర్యాపిడో బుక్ చేసుకుని బయల్దేరింది ఆమె. ఆదివారం ఇంటికి రాకపోయే సరికి ఆందోళనకు గురై తల్లి సమీప బంధువు అభిషేక్‌కు సమాచారం చేరవేసింది. అభిషేక్ కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హుస్సేన్ సాగర్‌లో శవమై తేలిన విజయలక్ష్మీ..
అయితే సోమవారం ఓ యువతి మృతదేహం హుస్సేన్ సాగర్‌లో తేలియాడింది. దీంతో అప్రమత్తమైన లేక్ పోలీసులు మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలోని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో ఓ యువతి అదృశ్యమైనట్లు సమాచారం అందింది. అదృశ్యమైన ఆ యువతి హుస్సేన్ సాగర్‌లో శవమై తేలిన యువతి ఒక్కరేనని పోలీసులు నిర్ధారించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విజయలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. అనంతరం డెడ్‌బాడీని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
గూగుల్‌లో శోధించి.. అన్నమయ్య విగ్రహం సాక్షిగా ఆత్మహత్య
తన సమస్యకు తన చావే పరిష్కారమని భావించిన విజయలక్ష్మీ ఎలా చనిపోవాలి.. ఎక్కడ చనిపోవాలి అని తన ల్యాప్‌టాప్‌లో గూగుల్‌లో శోధించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. మొత్తానికి జనవరి 31న ఇంటి నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని బయల్దేరిన విజయలక్ష్మి.. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అన్నమయ్య విగ్రహం సాక్షిగా సాగర్‌లో దూకింది. లుంబినీ పార్కు వైపు మృతదేహం కొట్టుకువచ్చి నీటిపై తేలియాడినట్లు పోలీసులు తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




