త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air Quality | ఢిల్లీతో పోటీ!.. హైద‌రాబాద్‌లో రోజురోజుకు క్షీణిస్తున్న గాలి నాణ్య‌త‌

Air Quality | హైద‌రాబాద్‌లో (Hyderabad) క్ర‌మంగా వాహ‌నాల ర‌ద్దీ పెరిగిపోతున్న‌ది. నిర్మాణ కార‌క‌లాపాలు కూడా జోరుగా సాగుతున్నాయి. వాహ‌నాలు విడుద‌ల చేసే పొగ‌, నిర్మాణ ప‌నుల వ‌ల్ల క‌లిసే ధూళి క‌ణాల‌తో రాజ‌ధానిలో గాలి నాణ్య‌త (Air Quality) రోజురోజుకు ప‌డిపోతున్న‌ది.

G

Telangana | Published On Jan 24, 2026, 3.51 pm IST

Air Quality | ఢిల్లీతో పోటీ!.. హైద‌రాబాద్‌లో రోజురోజుకు క్షీణిస్తున్న గాలి నాణ్య‌త‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో (Hyderabad) క్ర‌మంగా వాహ‌నాల ర‌ద్దీ పెరిగిపోతున్న‌ది. నిర్మాణ కార‌క‌లాపాలు కూడా జోరుగా సాగుతున్నాయి. వాహ‌నాలు విడుద‌ల చేసే పొగ‌, నిర్మాణ ప‌నుల వ‌ల్ల క‌లిసే ధూళి క‌ణాల‌తో రాజ‌ధానిలో గాలి నాణ్య‌త (Air Quality) రోజురోజుకు ప‌డిపోతున్న‌ది. శ‌నివారం తెల్ల‌వారుజామున సికింద్రాబాద్ ప‌రిధిలో గాలి నాణ్య‌త సూచీ (AQI) 240కి చేరింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఏక్యూఐ 181గా ఉన్న‌ది. కాగా, శుక్ర‌వారం తెల్ల‌వారుజామున కూడా ఉప్ప‌ర‌ప‌ల్లిలో ఏక్యూఐ 240గా ఉన్న‌ది.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు ట్రాఫిక్ క‌ష్టాల‌తో ఇబ్బందులు ఎదుర్కోంటున్న హైద‌రాబాద్ వాసుల‌కు ఇప్పుడు వాయుగండం పొంచి ఉన్న‌ద‌ని ప‌ర్యావ‌ర‌ణవేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఢిల్లీ త‌ర‌హాలోనే భాగ్య‌న‌గ‌రంలో కూడా రోజురోజుకు గాలి నాణ్య‌త ప‌డిపోతున్న‌ద‌ని చెబుతున్నారు. అయితే వాహనాల నుంచి వెలువడే పొగ, నిర్మాణ పనుల వల్ల గాలిలో కలిసే ధూళి కణాలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడం వంటివి కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణమ‌ని అధికారులు చెబుతున్నారు.

అయితే పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంద‌ని, ఈ నేప‌థ్యంలో శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారు, ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. వాయు నాణ్యత సూచీ 100 దాటితేనే ఆరోగ్యానికి ముప్పువాటిళ్లుంద‌ని తెలిపారు. ఒకవేళ అది 300కు చేరితే.. ఆ గాలిని పీల్చడం అంటే రోజుకు 30 నుంచి 35 సిగరెట్లు తాగినంత ప్రమాదమని, ఇది ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని హెచ్చ‌రిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement