Pen Down | తెలంగాణలో మరో ఉద్యమం.. జూన్ 12 నుంచి ‘పెన్‌డౌన్’..
Pen Down | మరో ఉద్యమానికి తెలంగాణ వేదిక కానుంది. వచ్చే నెల 12వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా 'పెన్‌డౌన్' ఉద్యమానికి ఏఐసీసీ మాజీ మెంబర్ బక్క జడ్సన్ పిలుపునిచ్చారు.
Pen Down | త్రినేత్ర.న్యూస్ : మరో ఉద్యమానికి తెలంగాణ వేదిక కానుంది. వచ్చే నెల 12వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా 'పెన్‌డౌన్' ఉద్యమానికి ఏఐసీసీ మాజీ మెంబర్ బక్క జడ్సన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, నిరుద్యోగ యువత, ప్రజా సంఘాలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జూన్ 12 నుండి రాష్ట్రవ్యాప్తంగా “పెన్‌డౌన్” ఉద్యమానికి బక్క జడ్సన్ పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజా సంఘాలు చేసిన త్యాగాలను ప్రభుత్వం మరచిపోయిందని జడ్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగ సంఘాలు, మేధావులు ప్రజల సమస్యలను పక్కన పెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, పీఆర్‌సీ బకాయిలు విడుదల చేయాలని, CPS రద్దు చేసి OPS అమలు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో దాదాపు 25,400 మంది ఉద్యోగులు రిటైర్డ్ బకాయిలు చెల్లించి, ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు తీవ్ర సిబ్బంది కొరతతో నడుస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే జూన్ 12 నుండి తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో “పెన్‌డౌన్” ఉద్యమం కొనసాగుతుందని బక్క జడ్సన్ హెచ్చరించారు.
బక్క జడ్సన్ మరిన్ని డిమాండ్లు ఇవే..
- 2 లక్షల ప్రభుత్వ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.
- నిరుద్యోగులకు నెలకు రూ. 4000 నిరుద్యోగ భృతి ఇవ్వాలి.
- నిరుద్యోగుల వయోపరిమితిని 49 సంవత్సరాలకు పెంచాలి.
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
- ఆశా వర్కర్ల జీతాలు పెంచాలి.
- ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



