CM Prajavani | సీఎం ఇచ్చిన మాట ప్రకారం ఫార్మాసిటీని రద్దు చేయాలి.. ప్రజావాణి ఇన్‌చార్జి విజయలక్ష్మి ఎదుట రైతుల గోడు
CM Prajavani | సీఎం రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం ఫార్మాసిటీని రద్దు చేయాలని రంగా రెడ్డి జిల్లా (Rangareddy District) ఫార్మా, ఫ్యూచర్ సిటీ (Pharma and Future City) బాధిత రైతులు (Farmers) డిమాండ్ చేశారు.
CM Prajavani | త్రినేత్ర న్యూస్: సీఎం రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం ఫార్మాసిటీని రద్దు చేయాలని రంగా రెడ్డి జిల్లా (Rangareddy District) ఫార్మా, ఫ్యూచర్ సిటీ (Pharma and Future City) బాధిత రైతులు (Farmers) డిమాండ్ చేశారు. భూ సేకరణ నుంచి తమ భూములను మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్, ఆర్డీవో ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన సీఎం ప్రజావాణి సందర్భంగా ప్రజావాణి ఇన్‌చార్జి గద్వాల విజయలక్ష్మి (Vijaya Laxmi) ఎదుట తమ గోడును వెల్లబోసుకున్నారు. అనంతరం వినతిపత్రాలు (Memorandums) అందించారు.
ఫార్మా సిటీ రద్దు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తే మేం సంతోషపడ్డాం. కానీ దాంతర్వాత ఇంకో ప్రాజెక్ట్ ఏదో తీసుకొచ్చారు. సీఎం దృష్టికి తీసుకురావాలని మేం చాలా ప్రయత్నం చేశాం. మా ఎమ్మెల్యే దగ్గరకు 20 సార్లు వెళ్లాం. అయినా ఏమాత్రం పట్టిచ్చుకోలేదు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం ఫార్మాసిటీని రద్దు చేయించాలి. మా భూములను భూ సేకరణ నుంచి మినహాయించాలి.
కరువు భత్యం వస్తలే.. ధాన్యం కొంటలే
ఆరేండ్లు అయిపోయింది. ఆన్‌లైన్‌లో లేదు. ఎవరికీ పంట రుణాలు రావట్లేదు. రైతుబంధు రావట్లేదు. ఆఖరికి కరువు భత్యం కూడా ఇవ్వట్లేదు. మార్కెట్‌లో అమ్ముకోవాలంటే వడ్లు కూడా కొంటలేరు. ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తుంది. మేం మా బాధతంతా లెటర్లలో రాసుకున్నం. అందరు కలిసి ఒకే లెటర్ ఇవ్వాలంటున్నరు.. అలా ఇచ్చినా ఫలితం లేదు. కలెక్టర్, ఆర్డీవో ఆఫీసుల చుట్టూ తిరిగినం. అయినా ఏం లాభం లేదు. అందుకే ఇక్కడికి వచ్చాం అని విజయలక్ష్మి ఎదుట బాధిత రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Musi Riverfront Development Project | మూసీ ప్రాజెక్టు: హరిత ప్రాంతాలు సగానికి తగ్గింపు.. రహదారులు 261 శాతం పెంపు!
- ●Idupu Kayitham | ఇడుపుకాయితం సీరియస్ సినిమా కాదు - ఆ గ్యారెంటీ మాది - నిర్మాత కామెంట్స్
- ●Devi Prasad | డీలిమిటేషన్ బిల్లుకు వాళ్లెందుకు మద్దతిస్తున్నారో అద్దంకి చెప్పాలి
- ●Invest Telangana Global Summit | సమ్మిట్ సన్నాహాల్లో ప్రజాప్రతినిధులకూ ప్రాధాన్యం
- ●Mallikarjun Kharge | ఆ బిల్లు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం : ఖర్గే
- ●Bitcoin | బిట్‌కాయిన్‌కు భారీ షాక్.. 60 వేల డాలర్ల దిగువకు ధర..

Musi Riverfront Development Project | మూసీ ప్రాజెక్టు: హరిత ప్రాంతాలు సగానికి తగ్గింపు.. రహదారులు 261 శాతం పెంపు!

Idupu Kayitham | ఇడుపుకాయితం సీరియస్ సినిమా కాదు - ఆ గ్యారెంటీ మాది - నిర్మాత కామెంట్స్

Devi Prasad | డీలిమిటేషన్ బిల్లుకు వాళ్లెందుకు మద్దతిస్తున్నారో అద్దంకి చెప్పాలి

Invest Telangana Global Summit | సమ్మిట్ సన్నాహాల్లో ప్రజాప్రతినిధులకూ ప్రాధాన్యం





