Prabhas | ప్రభాస్ సినిమా చేయడం నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు – డైలాగ్ రైటర్ కామెంట్స్
ప్రభాస్ ఆదిపురుష్ మూవీపై డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ ఆసక్తికర కామెంట్లు చేసింది. ఆదిపురుష్‌కు డైలాగ్స్ రాయడం తన కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Jul 25, 2026, 5.57 pm IST
Prabhas | ఆదిపురుష్ ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఏడు వందల కోట్లతో ఇండియాలోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాల్లో ఒకటిఈ మైథలాజికల్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. రామాయణ గాథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. కృతి సనన్ సీత పాత్రలో నటించగా...సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెలుగు, హిందీ భాషల్లో ఒకే సారి రూపొందిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ రిలీజై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
స్టైలిష్‌గా...
ఓం రౌత్ టేకింగ్, గ్రాఫిక్స్‌తో పాటు సీతారాముడితో పాటు రావణాసురుడి పాత్రలను తీర్చిదిద్దిన తీరుపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్‌ను స్టైలిష్‌గా చూపించడాన్ని చాలా మంది తప్పుపట్టారు. ఈ విమర్శల మూలంగా ఆదిపురుష్ మూవీకి భారీగానే నష్టాలు వచ్చాయి. పెట్టిన బడ్జెట్‌లో సగం వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.
తప్పు చేశా....
ఆదిపురుష్ సినిమాకు హిందీలో మనోజ్ ముంతాషిర్ డైలాగ్స్ అందించాడు. సినిమాలో అతడి డైలాగ్స్‌పై కూడా చాలానే అభ్యంతరాలు వచ్చాయి. జెన్‌జీ ఆడియెన్స్ కోసం తీసిన సినిమా ఇదంటూ తొలుత మేకర్స్‌ను వెనకేసుకొచ్చిన మనోజ్ విమర్శలతో వెనక్కి తగ్గారు. తాజాగా ఆదిపురుష్ సినిమాపై ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మనోజ్ ముంతాషిర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిపురుష్ సినిమాకు డైలాగ్స్ రాయడం జీవితంలో తాను చేసిన అతి పెద్ద పొరపాటు అని అన్నారు. 'ఆదిపురుష్ మూవీపై ఇంతలా ట్రోల్స్, విమర్శలు వస్తాయని అస్సలు ఊహించలేదు. తొలుత డైలాగ్స్ అర్థవంతంగానే ఉన్నాయంటూ నన్ను నేను సమర్థించుకుంటూ వచ్చా. నేను చేసిన తప్పేమిటో అర్థం చేసుకోవడానికి చాలా టైమ్ పట్టింది. శ్రీరాముడు, హనుమంతుడి గురించి రాసిన సంభాషణలను స్క్రీన్‌పై చూసుకున్నప్పుడు నేనేనా ఇలాంటివి రాసింది అని సిగ్గేసింది. ఆ సినిమా చేయడం నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మిస్టేక్. ఆదిపురుష్ విషయంలో ఎన్నిసార్లు అభిమానులకు క్షమాపణలు చెప్పిన తక్కువే' అని మనోజ్ అన్నారు. ఆయన కామెంట్లతో మరోసారి ఆదిపురుష్ మూవీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | ఓటీటీలోకి రష్మిక మందన్న బాలీవుడ్ బోల్డ్ మూవీ – పెళ్లికి ముందు సీక్రెట్ ఎఫైర్ బయటపడితే…
జులై 25, 2026

Ramayana | సీతగా సాయిపల్లవి ఎలా కనిపిస్తుందో తెలియదు : దీపికా చిఖ్లియా
జులై 25, 2026

Tamannaah | హీరోయిన్లను గ్లామర్ డాల్స్‌లా చూస్తారు – సౌత్ ఇండస్ట్రీపై తమన్నా కామెంట్లు
జులై 25, 2026
తాజావార్తలు
- ●KTR | ప్రజాశక్తి ఎప్పుడూ గొప్పదే.. కేటీఆర్ ట్వీట్ వైరల్..!
- ●Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్.. హెల్ప్‌లైన్ నంబర్ ఇదే
- ●CJP Protest Withdrawn | ఢిల్లీలో చల్లారిన 'నీట్' మంటలు: డిమాండ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఆందోళన విరమించిన సీజేపీ
- ●Mahesh Kumar Goud | మోదీ తలవంచక తప్పలేదు
- ●Nitin Nabin BJP | ధర్మేంద్ర ప్రధాన్ నిజాయతీకి నిదర్శనం : నితిన్ నబిన్
- ●Mayawati | రాజకీయ రగడలో అసలు సమస్య మరుగున పడొద్దు : మాయావతి

KTR | ప్రజాశక్తి ఎప్పుడూ గొప్పదే.. కేటీఆర్ ట్వీట్ వైరల్..!

Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్.. హెల్ప్‌లైన్ నంబర్ ఇదే

CJP Protest Withdrawn | ఢిల్లీలో చల్లారిన 'నీట్' మంటలు: డిమాండ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఆందోళన విరమించిన సీజేపీ

Mahesh Kumar Goud | మోదీ తలవంచక తప్పలేదు



