KTR Adilabad Rythu Garjana | ఇది అచ్చ కాంగ్రెస్ కాదు.. పచ్చ కాంగ్రెస్ కాదు.. లుచ్చా కాంగ్రెస్
గోదావరిలో 750 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనా మోటార్లు ఆన్ చేయలేదని రేవంత్ సర్కార్‌పై ఆదిలాబాద్ రైతు గర్జన సభలో కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సంక్షిప్త సారాంశం
కన్నేపల్లి వద్ద పంపులు ఆన్ చేయకపోవడం వల్లే తెలంగాణలో 35 లక్షల ఎకరాల్లో వానాకాలం పంట నష్టం వాటిల్లిందని కేటీఆర్ ఆరోపించారు. గోదావరి నుంచి 750 టీఎంసీల నీరు వృథాగా పోయినా రైతుల కోసం లిఫ్ట్ చేయలేదని, బోనస్ ఎగ్గొట్టేందుకే నీళ్లు లేవని డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు 'బడే భాయ్, చోటే భాయ్'లా ఒక్కటై పరస్పర దోపిడీకి సహకరించుకుంటున్నారని విమర్శించారు. చనాక-కొరాట ప్రాజెక్టు కాలువలను కూడా తవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టిని ఎలా నిర్మిస్తుందని ప్రశ్నించారు.
- ఆదిలాబాద్‌లో కేటీఆర్ ధ్వజం
- 750 టీఎంసీల నీళ్లు పోయినా మోటార్లు ఆన్ చేయలేదు
- రేవంత్ పాలనపై తీవ్ర విమర్శలు
KTR Adilabad Rythu Garjana | త్రినేత్ర న్యూస్ : రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన ‘రైతు గర్జన’ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ విధానాల కారణంగానే రాష్ట్రంలో సుమారు 35 లక్షల ఎకరాల్లో వానాకాలం పంట తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన ఆరోపించారు. స్థానిక నేత భార్గవ్ దేశ్‌పాండేతో కలిసి సభలో పాల్గొన్న కేటీఆర్, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ రైతులకు శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు.
750 టీఎంసీల నీళ్లు వృథా.. మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదు?
గోదావరి నదిలో వరద నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కేటీఆర్ మండిపడ్డారు. "నాలుగు నెలల క్రితమే కన్నేపల్లి పంప్‌హౌస్ వద్ద లక్ష క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లను నింపమని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పటివరకు దాదాపు 750 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలో కలిసిపోయాయి" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు సాగునీరు ఇవ్వమంటే, పంటలపై తమ రక్తం చల్లుకోమని రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని దుయ్యబట్టారు. "ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 20 వేల క్యూసెక్కుల నీరు పారుతోంది. తలచుకుంటే ఇప్పుడైనా నీళ్లను లిఫ్ట్ చేయవచ్చు. కానీ రేవంత్ ప్రభుత్వానికి ఆ ఉద్దేశమే లేదు. రైతులకు సాగునీరు ఇస్తే యూరియా సరఫరా చేయాలి, ధాన్యం కొనుగోలు చేయాలి, క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇవ్వాలి.. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకే ఎల్‌నినో సాకులు చెబుతూ కరెంట్ లేదు, నీళ్లు లేవంటూ డ్రామాలాడుతున్నారు" అని ఆయన ఎండగట్టారు.
బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి: కేటీఆర్ సంచలనం
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం సాగుతోందని కేటీఆర్ ఆరోపించారు. "దొంగ, చీకటి ఒక్కటైనట్లుగా ఢిల్లీ బడే భాయ్ మోదీ, గల్లీ చోటే భాయ్ రేవంత్ ఒక్కటయ్యారు. అందుకే ఆదిలాబాద్ ఎంపీ, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎప్పుడూ రేవంత్ రెడ్డి వైఫల్యాలపై మాట్లాడరు. ఆదిలాబాద్‌లో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట బీజేపీ ఎమ్మెల్యే సాగిస్తున్న దోపిడీకి రేవంత్ మద్దతు ఇస్తుంటే, రేవంత్ రెడ్డి అక్రమాలకు బీజేపీ నేతలు రక్షణగా నిలుస్తున్నారు" అని ఆరోపణలు చేశారు.
చనాక-కొరాట కాలువలు తవ్వలేనివారు ప్రాజెక్టులు కడతారా?
ఆదిలాబాద్ దశాబ్దాల కలను నిజం చేస్తూ బీఆర్ఎస్ హయాంలోనే చనాక-కొరాట ప్రాజెక్టును దాదాపు పూర్తి చేశామని కేటీఆర్ గుర్తుచేశారు. "మేము ప్రాజెక్ట్ కడితే, కనీసం పిల్ల కాలువలు తవ్వడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. వీళ్లు తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ కడతామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకోవడానికే ఈ ప్రభుత్వానికి మూడేళ్లు పట్టింది. కానీ మా నాయకుడు కేసీఆర్ కేవలం మూడేళ్ల రికార్డు సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి చూపించారు" అని కేటీఆర్ ఉద్ఘాటించారు. రైతుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ నల్లమల పిల్లికి ఎలుకను పట్టడం కూడా చేతనవ్వడం లేదా?
బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఎల్ నినో వస్తుందని, నీళ్లను ఎత్తిపోయాలని హెచ్చరించిన ఇంజనీర్లకు కాదు రేవంత్‌కు. నీళ్లను ఎత్తిపోయకుండా, కరువుకు కారణమైన నీకే ఇవ్వాలి. కరువు రాబోతోందని జూన్ నెల నుంచే బీఆర్ఎస్ హెచ్చరిస్తున్నా.. కన్నెపల్లి వద్ద లక్షల క్యూసెక్కుల నీళ్లు దిగువకు పోతున్నాయని మొత్తుకున్నా.. కేవలం మాపై రాజకీయ కక్షతో పంపులను ఆన్ చేయకుండా..
750 టీఎంసీల గోదావరి జలాలను దిగువకు వదిలేసి రాష్ట్రంలో కరువుకు కారణమైంది కాంగ్రెస్ సర్కారే.
కాళేశ్వరం వద్ద ఈరోజు ఈ నిమిషం కూడా 20 వేల క్యూసెక్కుల నీళ్లు పారుతున్నాయి. కావాలంటే ఇప్పుడు కూడా నీళ్లు ఎత్తుకోవచ్చు.. కానీ రేవంత్ రెడ్డికి ఎత్తే ఆలోచన లేదు. నీళ్లు ఇస్తే యూరియా ఇవ్వాలి, పంట కొనాలి, పంట బోనస్ ఇవ్వాలి.. ఇవన్నీ ఎగ్గొట్టడానికి కరెంట్ లేదు, నీళ్లు లేవని అంటున్నారు. ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసే తెలివి లేదు కానీ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కడతారట. ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల చనాక-కొరాట ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. మూడేళ్లలో కనీసం డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా తవ్వలేదు. కానీ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కడతామని డ్రామా చేస్తున్నారు
రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ప్రేమ ఉంటే ఎగ్గొట్టిన మూడు రైతుబంధులతో పాటు యాసంగి రైతుబంధు కలిసి ఎకరానికి రూ.60 వేలు వెయ్యాలి. అలానే కౌలు రైతులకు కూడా ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు రైతుబంధు డబ్బులు వెయ్యాలి.
భూమి లేని రైతు కూలీలకు నెలకు రూ.1000 వేస్తామని అన్నారు, 36 నెలలు అయింది. రైతు కూలీలకు వెంటనే రూ.36000 విడుదల చేయాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ దోపిడి చేస్తున్నాడు.
ఆ దోపిడీకి రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నాడు. అలాగే రేవంత్ రెడ్డి దోపిడీకి బీజేపీ నాయకులు మద్దతు ఇస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ దొంగలు ఒక్కటయ్యారు కాబట్టే, మీ బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ ఒక్కరోజు కూడా రేవంత్ రెడ్డిని నిలదీసి ప్రశ్నించడం చేయరు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తాను గెలిస్తే సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని అన్నాడు.
ఆ సిమెంట్ ఫ్యాక్టరీని తెరవకుండా దాన్ని తుక్కు కింద అమ్మేస్తున్నారు.
ఈ బీజేపీ వాళ్లది అయితే జుమ్లా లేదా హమ్లా
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి 7 మంది చిన్నారులు చనిపోతే, 24 మంది చిన్నారులు గాయపడ్డారు. ఆ బాధిత చిన్నారుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ తరపున చిన్న ఆర్థిక సాయం చేశాం. దీని మీద మేము ప్రశ్నిస్తే ఎలుకల వల్ల ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది.. అని దుయ్యబట్టారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●INDIA Bloc Delhi Rally | ఓట్ల దొంగలను వదిలిపెట్టం.. జ్ఞానేశ్ జైలుకెళ్లడం ఖాయం
- ●Namasthe Telangana First Batch Reunion | 16 ఏళ్ల తర్వాత నమస్తే తెలంగాణ తొలి బ్యాచ్ ఆత్మీయ కలయిక: అవమానాలు దాటి చరిత్ర సృష్టించాం
- ●Shivathmika Rajashekar | రెండు నెలల గ్యాప్‌లో నాలుగు సినిమాలు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు బిజీ బిజీ
- ●Nannapuneni Narender Meets KCR | మా కుమారుడి పెళ్లికి రండి : కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందించిన నన్నపునేని నరేందర్
- ●Aadarsha Kutumbam | రెండో రోజు తగ్గిన ఆదర్శ కుటుంబం కలెక్షన్స్
- ●Traffic Restrictions | బీజేపీ పాదయాత్ర.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

INDIA Bloc Delhi Rally | ఓట్ల దొంగలను వదిలిపెట్టం.. జ్ఞానేశ్ జైలుకెళ్లడం ఖాయం

Namasthe Telangana First Batch Reunion | 16 ఏళ్ల తర్వాత నమస్తే తెలంగాణ తొలి బ్యాచ్ ఆత్మీయ కలయిక: అవమానాలు దాటి చరిత్ర సృష్టించాం

Shivathmika Rajashekar | రెండు నెలల గ్యాప్‌లో నాలుగు సినిమాలు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు బిజీ బిజీ

Nannapuneni Narender Meets KCR | మా కుమారుడి పెళ్లికి రండి : కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందించిన నన్నపునేని నరేందర్






