Adilabad | ఆదిలాబాద్‌లో మండుటెండలు.. ప్రపంచంలోనే 14వ స్థానం..
Adilabad | తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా మాత్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల జాబితాలో ఆదిలాబాద్ చేరింది.
Adilabad | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా మాత్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల జాబితాలో ఆదిలాబాద్ చేరింది. సోమవారం నాడు(ఏప్రిల్ 20) ఆదిలాబాద్ జిల్లాలో 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే అమెరికాకు చెందిన ఎల్డ్‌రాడో వెదర్ రిపోర్టు ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా 14వ స్థానంలో నిలిచింది.
మహారాష్ట్రలోని అకోలా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో అగ్రస్థానంలో నిలిచింది. ఆదిలాబాద్‌లో అకోలా కంటే 2 డిగ్రీలు మాత్రమే తక్కువగా నమోదైంది. ఇక అకోలా, ఆదిలాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని వార్ధా, నాగ్‌పూర్, యూపీలోని ప్రయాగ్‌రాజ్, ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ కూడా ఈ జాబితాలో చేరాయి.
ఇక తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో చూసినట్లయితే కొత్తగూడెంలో 43.3, గద్వాల 43.3, నిర్మల్ 43.0, నిజామాబాద్ 43.0 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా వేడికి నెలవైన మహారాష్ట్ర విదర్భ సరిహద్దులో ఉండటం వల్ల మధ్య భారతం నుంచి వచ్చే పొడి, వేడి గాలులు ఇక్కడ ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని ఐఎండీ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దీనికి తోడు అడవుల విస్తీర్ణం తగ్గడం కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. 2021లో 18,561 చదరపు కిలోమీటర్లుగా ఉన్న తెలంగాణ అటవీ విస్తీర్ణం.. 2023 నాటికి 18,456 చదరపు కిలోమీటర్లకు తగ్గిందని వెల్లడించారు. ఆదిలాబాద్, కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పచ్చదనం తగ్గడం వల్ల సహజసిద్ధమైన చల్లదనం తగ్గి హీట్ వేవ్స్ తీవ్రత పెరుగుతోందని అంటున్నారు.
సోమవారం హైదరాబాద్ సరూర్‌నగర్ సర్కిల్‌లోని న్యూ నాగోల్ ప్రాంతంలో 41.7 డిగ్రీల సెల్సియస్, ముషీరాబాద్ ప్రాంతంలో 41.6 డిగ్రీల సెల్సియస్, అంబర్‌పేట 41.4. మల్కాజిగిరి 41.3, ఎల్బీనగర్, 41.3, మెహదీపట్నం 41.1 డిగ్రీ సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



