త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thakkalapally Ravinder Rao | ఏబీఎన్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి – శాస‌న‌మండ‌లి చైర్మెన్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీలు

Thakkalapally Ravinder Rao | ఏబీఎన్ (ABN Channel)లో ఇటీవ‌ల జ‌రిగిన ఒక డిబేట్‌లో ఎమ్మెల్సీ (MLC) త‌క్క‌ళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్‌రావు (Thakkalapally Ravinder Rao) ను అవ‌మానించిన ఘ‌ట‌న‌లో త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు శాస‌న‌మండ‌లి చైర్మెన్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డిని ఎమ్మెల్సీలు క‌లిసి ఫిర్యాదు చేశారు.

A

Telangana | Published On Jan 27, 2026, 3.19 pm IST

Thakkalapally Ravinder Rao | ఏబీఎన్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి – శాస‌న‌మండ‌లి చైర్మెన్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీలు
Advertisement

Thakkalapally Ravinder Rao | త్రినేత్ర‌.న్యూస్‌ : ఏబీఎన్ (ABN Channel)లో ఇటీవ‌ల జ‌రిగిన ఒక డిబేట్‌లో ఎమ్మెల్సీ (MLC) త‌క్క‌ళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్‌రావు (Thakkalapally Ravinder Rao) ను అవ‌మానించిన ఘ‌ట‌న‌లో త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు శాస‌న‌మండ‌లి చైర్మెన్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డిని ఎమ్మెల్సీలు క‌లిసి ఫిర్యాదు చేశారు. అనంత‌రం వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీని చాన‌ల్‌లో చ‌ర్చ‌కు పిలిచి అవ‌మానించ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. చ‌ర్చ‌లో వ్యాఖ్యాత‌ బీఆర్ఎస్‌పై కుట్ర‌తో వ్య‌వ‌హ‌రించ‌డంతో దానిని అడ్డుకునేందుకు త‌క్క‌ళ్ల‌ప‌ల్లి ప్ర‌యత్నించార‌ని గుర్తు చేశారు. త‌మ నేత‌ల‌పై బుద‌ర‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేశార‌ని మండిప‌డ్డారు. దీనిని ఆయ‌న‌పై జ‌రిగిన దాడిగా కాకుండా శాస‌న‌మండ‌లి సభ్యుల‌పై జ‌రిగిన దాడిగా భావించాల‌ని సూచించారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి చ‌ర్య‌లు పున‌రావృతం కాకుండా చూసుకోవాల‌ని కోరారు. మొద‌టినుంచీ ఏబీఎన్ చాన‌ల్ తెలంగాణ వ్య‌తిరేక‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తోందని ఆరోపించారు. ఉద్య‌మానికి న‌ష్టం చేసేలా కేసీఆర్‌పై విష‌ప్ర‌చారం చేస్తూ ప‌త్రికా నిబంధ‌న‌లు కూడా ఉల్లంఘించార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో శాస‌న‌మండ‌లిలో ప్ర‌తిప‌క్ష‌నేత ముధుసూద‌నాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి, విప్ దేశ‌ప‌తి శ్రీ‌నివాస్‌, ఎమ్మెల్సీలు త‌క్క‌ళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్‌రావు, ఎల్ ర‌మ‌ణ‌, న‌వీన్‌కుమార్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement