త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | తైలంతో స్నానం చేస్తే సంతానం.. బాత్రూమ్‌లోకి వెళ్ల‌గా బంగారంతో ప‌రార్

Telangana | పెళ్లాయ్యాక సంతానం క‌ల‌గ‌క‌పోతే ఆ దంప‌తుల వ‌ర్ణాతీతం. సంతానం కోసం మొక్క‌ని దేవుడు ఉండ‌డు. చేయ‌ని పూజ ఉండ‌దు. చివ‌ర‌కు భూత వైద్యులను గుడ్డిగా న‌మ్మేస్తారు. దంప‌తుల అమాయ‌క‌త్వాన్ని ఆ భూత వైద్యులు సొమ్ముగా చేసుకుని నిలువునా మోసం చేస్తారు.

S

Telangana | Published On Feb 9, 2026, 6.54 pm IST

Telangana | తైలంతో స్నానం చేస్తే సంతానం.. బాత్రూమ్‌లోకి వెళ్ల‌గా బంగారంతో ప‌రార్
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్ : పెళ్లాయ్యాక సంతానం క‌ల‌గ‌క‌పోతే ఆ దంప‌తుల వ‌ర్ణాతీతం. సంతానం కోసం మొక్క‌ని దేవుడు ఉండ‌డు. చేయ‌ని పూజ ఉండ‌దు. చివ‌ర‌కు భూత వైద్యులను గుడ్డిగా న‌మ్మేస్తారు. దంప‌తుల అమాయ‌క‌త్వాన్ని ఆ భూత వైద్యులు సొమ్ముగా చేసుకుని నిలువునా మోసం చేస్తారు. అలాంటి ఘ‌ట‌నే యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా భూదాన్ పోచంప‌ల్లి ప‌రిధిలోని గాంధీన‌గ‌ర్‌కు చెందిన ఓ మ‌హిళ‌కు పెళ్లై చాలా కాలం అవుతుంది. కానీ సంతానం క‌ల‌గ‌డం లేదు. ఈ విష‌యం తెలుసుకున్న ఓ వ్య‌క్తి.. ఆమెను సంప్ర‌దించాడు. తాను కేర‌ళ యునాని వైద్యుడిన‌ని ప‌రిచ‌యం చేసుకున్నాడు. తాను చెప్పిన‌ట్టు చేస్తే త‌ప్ప‌కుండా సంతానం క‌లుగుతుంద‌ని న‌మ్మించాడు.

ఆమె కూడా అత‌ని మాట‌లు న‌మ్మి.. ఇంట్లోకి ఆహ్వానించింది. కాసేపు ఆమెతో మాట‌లు క‌లిపి.. తాను ఓ తైలం ఇస్తాను. దాన్ని ప్ర‌తిరోజు స్నానం చేసిన త‌ర్వాత ఒంటికి రాసుకోవాల‌ని ఆదేశించాడు. ఇలా చేస్తే 40 రోజుల్లో ఫ‌లితం వ‌స్తుంద‌ని గ‌ట్టిగా న‌మ్మించాడు. ఇప్పుడే ఒంటి మీద ఉన్న బంగారాన్ని తీసి స్నానం చేయాల‌ని, అనంత‌రం తైలాన్ని రాసుకోవాల‌ని న‌మ్మ‌బ‌లికాడు.

ఇంకేముంది ఆ మాయ‌లోడి మాట‌లు విన్న బాధిత మ‌హిళ మెడ‌లో ఉన్న బంగారాన్ని తీసి స్నానానికి వెళ్లింది. ఇక బంగారు న‌గ‌ల‌ను త‌న బ్యాగులో వేసుకుని అత‌ను ప‌రార‌య్యాడు. స్నానం చేసి వ‌చ్చిన మ‌హిళ‌కు న‌గ‌లు క‌నిపించ‌క‌పోవ‌డంతో.. ల‌బోదిబోమ‌నుకుంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement