త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyberabad Police | మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కే లాగౌట్ అవ్వండి..

Cyberabad Police | ఈ నెల 18 నుంచి 20వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్ న‌గ‌రంలో సాయంత్రం, రాత్రి వేళ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

S

Hyderabad | Published On Sep 18, 2026, 8.50 am IST

Cyberabad Police | మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కే లాగౌట్ అవ్వండి..
Advertisement

Cyberabad Police | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల 18 నుంచి 20వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్ న‌గ‌రంలో సాయంత్రం, రాత్రి వేళ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. అంతేకాకుండా ఈ వారం రోజుల పాటు న‌గ‌ర వ్యాప్తంగా వినాయ‌క నిమ‌జ్జ‌నాల ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. భారీ వ‌ర్ష సూచ‌న‌, వినాయ‌క నిమ‌జ్జ‌నం నేప‌థ్యంలో సైబ‌రాబాద్ పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

ఈ నెల 18 నుంచి 25వ తేదీ వ‌ర‌కు ఐటీ ఉద్యోగులు సాధ్య‌మైనంత వ‌ర‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ప్లాన్ చేసుకోవాల‌ని సూచించారు. ఇందుకు ఐటీ కంపెనీలు కూడా స‌హ‌క‌రించాల‌ని పోలీసులు కోరారు. ఒక వేళ త‌ప్ప‌నిసరి ప‌రిస్థితుల్లో కార్యాల‌యాల‌కు వెళ్తే.. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కే లాగౌట్ అవ్వాల‌ని పోలీసులు సూచించారు.

సైబ‌రాబాద్ ప‌రిధిలోని విద్యాసంస్థ‌లు కూడా సాధ్య‌మైనంత వ‌ర‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హించాల‌న్నారు. ట్రాఫిక్ భారీగా ఉండే అవ‌కాశం ఉన్నందున విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని విద్యాసంస్థ‌ల‌ను పోలీసులు కోరారు.

Advertisement
Advertisement