Travels Bus Accident | ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. తప్పిన పెను ప్రమాదం
Travels Bus Accident | భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా గట్టుగూడెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి (Travels Bus Accident) బోల్తాపడింది. ఈ ఘటన జరిగినపుడు బస్సులో 48 మంది ప్రయాణీకులు ఉండగా, 12 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి.
Travels Bus Accident | త్రినేత్ర.న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా గట్టుగూడెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి (Travels Bus Accident) బోల్తాపడింది. ఈ ఘటన జరిగినపుడు బస్సులో 48 మంది ప్రయాణీకులు ఉండగా, 12 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. మిగిలిన ప్రయాణీకులకు ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు 48 మంది ప్రయాణీకులతో వెళ్తున్నకేవీఆర్ ట్రావెల్స్ బస్సు గట్టుగూడెం వద్ద అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది.
ఈ ఘటనలో గాయపడిన వారిని హుటాహుటిన అంబులెన్సుల్లో సమీపంలోని సత్తుపల్లి, దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి, ప్రథమ చికిత్స అందించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు అతివేగం లేదా బ్రేక్ ఫెయిలవడం ప్రాథమిక కారణాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





