త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kamareddy | నాలుగో సంతానంలోనూ అమ్మాయే.. రూ. ల‌క్ష‌కు అమ్మిన త‌ల్లి

Kamareddy | ఆడ‌పిల్ల‌లు భార‌మైపోతూనే ఉన్నారు.. వ‌రుస‌గా నాలుగో సంతానంలోనూ ఆడ‌శిశువు జ‌న్మించింద‌ని చెప్పి.. 18 రోజుల ప‌సిబిడ్డ‌ను రూ. ల‌క్ష‌కు విక్ర‌యించారు.

S

Telangana | Published On Apr 10, 2026, 6.45 pm IST

Kamareddy | నాలుగో సంతానంలోనూ అమ్మాయే.. రూ. ల‌క్ష‌కు అమ్మిన త‌ల్లి
Advertisement

Kamareddy | త్రినేత్ర‌.న్యూస్ : ఆడ‌పిల్ల‌లు భార‌మైపోతూనే ఉన్నారు.. వ‌రుస‌గా నాలుగో సంతానంలోనూ ఆడ‌శిశువు జ‌న్మించింద‌ని చెప్పి.. 18 రోజుల ప‌సిబిడ్డ‌ను రూ. ల‌క్ష‌కు విక్ర‌యించారు. ఈ అమానుష ఘ‌ట‌న కామారెడ్డి జిల్లా బాన్సువాడ‌లో వెలుగు చూసింది.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప‌రిధిలోని దామ‌రంచ గ్రామానికి చెందిన కిష్ట‌వ్వ‌కు ఇప్ప‌టికే ముగ్గురు సంతానం. వీరంతా ఆడ‌పిల్ల‌లే. నాలుగో సంతానంలోనైనా వార‌సుడు జ‌న్మిస్తాడ‌ని భావించారు. కానీ అమ్మాయి జ‌న్మించింది. దీంతో తీవ్ర మ‌న‌స్తాసానికి గురైన త‌ల్లి కిష్ట‌వ్వ‌.. ఆ ప‌సిబిడ్డ‌ను అమ్మ‌కానికి పెట్టింది.

ఈ క్ర‌మంలో గ్రామానికి చెందిన మ‌హిళ అనురాధ‌కు రూ. ల‌క్ష‌కు ప‌సిపాప‌ను త‌ల్లి కిష్ట‌వ్వ విక్ర‌యించింది. నాలుగో సంతానంలోనూ మ‌ళ్లీ ఆడ‌పిల్ల పుట్ట‌డంతో పోషించ‌లేక‌నే అమ్మేసిన‌ట్లు కిష్ట‌వ్వ పోలీసుల‌కు తెలిపింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కిష్ట‌వ్వ‌, అనురాధ‌తో పాటు మ‌రో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
Advertisement