త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | మీ వ‌ల్లే డాక్ట‌ర్ అయ్యాను స‌ర్.. హ‌రీశ్‌రావు కారును 20 కి.మీ. ఛేజ్ చేసి థ్యాంక్స్ చెప్పిన యువ‌తి

Harish Rao | ఎంతో మంది నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావుకు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని ఓ దృశ్యం ఆయ‌న క‌ళ్ల ముందు ఆవిష్కృత‌మైంది. ఆప‌ద‌లో ఆదుకునే గొప్ప మ‌నసున్న నాయ‌కుడు హ‌రీశ్‌రావును ఓ వైద్య విద్యార్థిని గుండెల‌కు హ‌త్తుకుని ఆనంద భాష్పాలు రాల్చింది.

S

Telangana | Published On Dec 7, 2025, 5.47 pm IST

Harish Rao | మీ వ‌ల్లే డాక్ట‌ర్ అయ్యాను స‌ర్.. హ‌రీశ్‌రావు కారును 20 కి.మీ. ఛేజ్ చేసి థ్యాంక్స్ చెప్పిన యువ‌తి
Advertisement

Harish Rao | హైద‌రాబాద్ : ఎంతో మంది నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావుకు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని ఓ దృశ్యం ఆయ‌న క‌ళ్ల ముందు ఆవిష్కృత‌మైంది. ఆప‌ద‌లో ఆదుకునే గొప్ప మ‌నసున్న నాయ‌కుడు హ‌రీశ్‌రావును ఓ వైద్య విద్యార్థిని గుండెల‌కు హ‌త్తుకుని ఆనంద భాష్పాలు రాల్చింది. మీ వ‌ల్లే డాక్ట‌ర్ అయ్యాను స‌ర్ అంటూ భావోద్వేగానికి లోనైంది.

మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఓ ప్ర‌ధాన ర‌హ‌దారిపై త‌న కారులో వెళ్తున్నారు. త‌న వైద్య విద్య‌కు సాయం చేసిన హ‌రీశ్‌రావును చూసిన ఓ యువ‌తి.. ఎలాగైనా ఆయ‌న‌ను క‌ల‌వాల‌ని సంక‌ల్పించింది. దీంతో హైవేపై 20 కిలోమీట‌ర్లు కారులో ఛేజ్ చేసి హ‌రీశ్‌రావును క‌లిసింది. ఇక హ‌రీశ్‌రావు కారులో నుంచి దిగి.. ఆప్యాయంగా ప‌లుక‌రించి, ఆమె భ‌విష్య‌త్ మ‌రింత గొప్ప‌గా ఉండాల‌ని దీవించారు. మీ వల్లే డాక్టర్ అయ్యాను స‌ర్.. ప్ర‌స్తుతం ప్రాక్టీస్ చేస్తున్నానంటూ ఆమె కన్నీళ్లతో చెప్పిన మాటలకు హరీశ్ రావు చలించిపోయారు.

ఈ సంఘ‌ట‌న‌తో పదవులు శాశ్వతం కాదు.. మనం చేసే పనులే శాశ్వతం అని నిరూపించారు హ‌రీశ్‌రావు. ఇవాళ గెలిచింది కేవలం ఆ వైద్య విద్యార్థిని మాత్రమే కాదు.. నమ్ముకున్న వారికి అండగా నిలిచిన హరీశ్ రావు వ్యక్తిత్వం కూడా గెలిచింది.

Advertisement

తాజావార్తలు

Advertisement