త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | డైట్ బిల్లులు ఇచ్చేందుకు వెళ్తూ ప్రిన్సిపాల్‌, వార్డెన్ మృతి.. పాఠ‌శాల‌లో విషాద ఛాయ‌లు.. ఈ ఘోరం ఎక్క‌డ జ‌రిగిందంటే!

Road Accident | ఆ ప్రిన్సిపాల్‌, వార్డెన్ అప్ప‌టివ‌ర‌కు పిల్ల‌లతో ఆప్యాయంగా గడిపి స్నాక్స్ పంచారు. ఇక డైట్ బిల్లులు ఇచ్చేందుక‌ని స్కూటీపై బ‌య‌లుదేరారు. టిప్ప‌ర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఇద్ద‌రిని మింగేసింది.

S

Telangana | Published On Nov 21, 2026, 5.17 pm IST

Road Accident | డైట్ బిల్లులు ఇచ్చేందుకు వెళ్తూ ప్రిన్సిపాల్‌, వార్డెన్ మృతి.. పాఠ‌శాల‌లో విషాద ఛాయ‌లు.. ఈ ఘోరం ఎక్క‌డ జ‌రిగిందంటే!
Advertisement

Road Accident |త్రినేత్ర న్యూస్: ఆ ప్రిన్సిపాల్‌, వార్డెన్ అప్ప‌టివ‌ర‌కు పిల్ల‌లతో ఆప్యాయంగా గడిపి స్నాక్స్ పంచారు. ఇక డైట్ బిల్లులు ఇచ్చేందుక‌ని స్కూటీపై బ‌య‌లుదేరారు. టిప్ప‌ర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఇద్ద‌రిని మింగేసింది. ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న సూర్యాపేట జిల్లా బీబీగూడెం స‌మీపంలో చోటుచేసుకుంది.

పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రం సమీప చివ్వెంల మండల కేంద్రంలోని మినీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌గా కోట్ల రజితారెడ్డి (45), వసతిగృహ వార్డెన్‌గా గుగులోతు రక్మా (43) విధులు నిర్వర్తిస్తున్నారు. సూర్యాపేటకు చెందిన వీరిద్దరూ ఎప్పటిలాగే శుక్రవారం విధులకు హాజరయ్యారు. పిల్లలకు స్నాక్స్‌ పంపిణీ చేసిన అనంతరం వసతిగృహ డైట్‌ బిల్లులను నల్గొండ జిల్లా కేంద్రంలో సమర్పించేందుకు స్కూటీపై వెళ్తున్నారు.

ముందుగా రజితారెడ్డి ద్విచక్రవాహనంపై సూర్యాపేటలోని ఆమె ఇంటికి వెళ్లి, భోజనం చేశాక బస్సులో నల్గొండకు వెళ్లాలనుకున్నారు. రోజూ వెళ్లే మార్గం నుంచి కాకుండా త్వ‌ర‌గా వెళ్ల‌వ‌చ్చ‌ని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ నుంచి జాతీయ రహదారి మీదుగా ఇంటికి వెళ్లాల‌నుకున్నారు. ఈ క్రమంలో బీబీగూడెం సమీపంలో కాల్వ పక్కన మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వచ్చిన టిప్పర్‌ వారిని బ‌లంగా ఢీకొట్టింది. దీంతో రజితారెడ్డి, రక్మా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రిన్సిపల్, వార్డెన్‌ మృతి చెందారని తెలిసి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. రజితారెడ్డికి భర్త, ఇద్దరు కుమారులున్నారు. రక్మా భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా వారికి ఇద్దరు కుమార్తెలున్నారు.

స‌మాచాం అందుకున్న‌ ఎస్పీ నరసింహ, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ వెంకటయ్య ఘ‌ట‌నా స్థ‌లాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇద్ద‌రు మ‌హిళా ఉద్యోగిణులు మృతి చెంద‌డంతో ఆర్సీవో గురుకుల పాఠశాలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

Advertisement
Advertisement