త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karimanagar | భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌.. క‌వ‌ల పిల్ల‌ల‌ను బావిలో తోసేసిన తండ్రి

Karimanagar | ఓ తండ్రి దారుణానికి పాల్ప‌డ్డాడు. అభంశుభం తెలియ‌ని అమాయ‌క క‌వ‌ల పిల్ల‌ల‌ను బావిలో తోసేసి రాక్ష‌సానందం పొందాడు.

S

Telangana | Published On Apr 3, 2026, 7.53 pm IST

Karimanagar | భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌.. క‌వ‌ల పిల్ల‌ల‌ను బావిలో తోసేసిన తండ్రి
Advertisement

Karimanagar | త్రినేత్ర‌.న్యూస్ : ఓ తండ్రి దారుణానికి పాల్ప‌డ్డాడు. అభంశుభం తెలియ‌ని అమాయ‌క క‌వ‌ల పిల్ల‌ల‌ను బావిలో తోసేసి రాక్ష‌సానందం పొందాడు. ఈ దారుణ ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ రూర‌ల్ మండ‌ల ప‌రిధిలోని జూబ్లీన‌గ‌ర్‌లో చోటు చేసుకుంది.

క‌వ‌ల పిల్ల‌ల‌ను బావిలో తోసేసిన ఘ‌ట‌న‌ను స్థానికులు గ‌మ‌నించారు. అనంత‌రం పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. బావిలో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఒక పాప మృత‌దేహాన్ని గ్రామ‌స్తుల స‌హాయంతో పోలీసులు వెలికితీశారు. మ‌రో చిన్నారి ఆచూకీ కోసం గ్రామ‌స్తులు గాలిస్తున్నారు. తండ్రికి దేహ‌శుద్ధి చేసి అత‌న్ని పోలీసుల‌కు అప్ప‌గించారు. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వే ఈ ఘాతుకానికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement