Kishan Reddy | ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ కోసం నోడల్ అధికారిని నియమించండి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Kishan Reddy | ఆదిలాబాద్ జిల్లాలోని ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్, జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (JUA) ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.
Kishan Reddy | త్రినేత్ర.న్యూస్: ఆదిలాబాద్ జిల్లాలోని ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్, జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (JUA) ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం రక్షణ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. పనులు వేగవంతంగా పూర్తి చేసేందకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నోడల్ అధికారిని నియమించాలని కోరారు. అన్ని శాఖలు, సంబంధిత సంస్థల మధ్య సమన్వయం పెంచాలన్నారు. ఈమేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు.
రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. ట్రైనర్ విమానాలు, విమానాల పార్కింగ్ ప్రాంతాలు, వెదర్ షెల్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్లు, ఆపరేషనల్ కాంప్లెక్స్, శిక్షణా సదుపాయాలు, విమానాల నిర్వహణకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
మరోవైపు పౌర విమానయాన అవసరాల కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఆధ్వర్యంలో సివిల్ టెర్మినల్, మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఆపరేషన్స్ (MRO) సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నారు. రక్షణ సిబ్బందికి సింగిల్ లివింగ్ క్వార్టర్స్, పెళ్లయిన సిబ్బందికి నివాసాలు, క్రీడా, వినోద సదుపాయాలు ఇతర మౌలిక వసతులతో పాటు నీటి సరఫరా, పారిశుద్ధ్య సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mumbai Coastal Road Accident | రోడ్డుపై గాల్లోకి లేచి పల్టీలు కొట్టిన బీఎండబ్ల్యూ.. బ్రిడ్జి పైనుంచి పడి ముగ్గురు దుర్మరణం
- ●MLC Dasoju Sravan | నిన్న పులి.. నేడు పిల్లి.. 'దానం'పై ఎమ్మెల్సీ దాసోజు సెటైర్లు
- ●Dil Raju | వినాయక నిమజ్జనం వేడుకల్లో భార్యతో కలిసి దిల్‌రాజు తీన్మార్ డ్యాన్స్
- ●largest Bar in Hyderabad | హైదరాబాద్ లో అతిపెద్ద బార్.. ఎక్కడుందో తెలుసా
- ●Vardhannapeta | మార్చురీలో శవాన్ని పీక్కతిన్న ఎలుకలు.. ఎక్కడో తెలుసా..?
- ●Sanath Nagar TIMS | సనత్ నగర్ టిమ్స్‌లో చోరీ.. కేసు నమోదు

Mumbai Coastal Road Accident | రోడ్డుపై గాల్లోకి లేచి పల్టీలు కొట్టిన బీఎండబ్ల్యూ.. బ్రిడ్జి పైనుంచి పడి ముగ్గురు దుర్మరణం

MLC Dasoju Sravan | నిన్న పులి.. నేడు పిల్లి.. 'దానం'పై ఎమ్మెల్సీ దాసోజు సెటైర్లు

Dil Raju | వినాయక నిమజ్జనం వేడుకల్లో భార్యతో కలిసి దిల్‌రాజు తీన్మార్ డ్యాన్స్

largest Bar in Hyderabad | హైదరాబాద్ లో అతిపెద్ద బార్.. ఎక్కడుందో తెలుసా





