Lay Off | పోర్షేలో మరో 4,100 ఉద్యోగాల కోత..? ఆమోదం తెలిపిన వోక్స్ వ్యాగన్ సూపర్‌వైజరీ బోర్డు..!
Lay Off | వోక్స్ వ్యాగన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షేలో మరో భారీ ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమవుతోందా? అంటే అనువననే సమాధానం వస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీ సుమారు 4,100 మంది ఉద్యోగాలకు కోత విధించే ప్రతిపాదనకు వోక్స్‌వ్యాగన్ సూపర్‌వైజరీ బోర్డు ఆమోదం తెలిపినట్లు జర్మనీకి చెందిన ఓ బిజినెస్ డైలీ కథనం వెల్లడించింది.
Lay Off | వోక్స్ వ్యాగన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షేలో మరో భారీ ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమవుతోందా? అంటే అనువననే సమాధానం వస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీ సుమారు 4,100 మంది ఉద్యోగాలకు కోత విధించే ప్రతిపాదనకు వోక్స్‌వ్యాగన్ సూపర్‌వైజరీ బోర్డు ఆమోదం తెలిపినట్లు జర్మనీకి చెందిన ఓ బిజినెస్ డైలీ కథనం వెల్లడించింది. ఈ సమాచారం ఇప్పటివరకు వోక్స్‌వ్యాగన్, పోర్షే అధికారికంగా ధ్రువీకరించలేదు. కంపెనీ ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగానే ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. సుమారు 700 మిలియన్ పౌండ్ల (దాదాపు 803.8 మిలియన్ డాలర్లు) మేర ఓవర్‌హెడ్ లోటును భర్తీ చేయడమే లక్ష్యంగా ఉద్యోగుల తొలగింపునకు ప్రతిపాదించినట్లు నివేదిక పేర్కొంది. ఇప్పటికే కుదిరిన ఉద్యోగాల కోత ఒప్పందాలకు అదనంగా ఈ 4,100 పోస్టులను తగ్గించనున్నట్లు తెలిపింది.
ఇప్పటికే 9వేల ఉద్యోగాల కోతకు ఒప్పందం
పోర్షేలో ఉద్యోగుల కోత కొత్త విషయం కాదు. ఈ ఏడాది జూలైలో యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య అదనంగా 5వేల ఉద్యోగాలను తగ్గించేందుకు ఒప్పందం కుదిరింది. అంతకుముందే మరో 4వేల మందిని ఇంటికి పంపేందుకు ఒప్పందం జరిగింది. దీంతో 2035 నాటికి స్టుట్‌గార్ట్ కేంద్రంగా పనిచేస్తున్న పోర్షేలో దాదాపు 9వేల ఉద్యోగాలు తగ్గించనున్నారు. తాజాగా మరో 4,100 ఉద్యోగాల కోతకు సంబంధించిన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే, పునర్వ్యవస్థీకరణ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే, ఈ తాజా ప్రతిపాదనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే, తాజాగా ఉద్యోగుల కోతలకు సంబంధించిన వార్తలపై వోక్స్‌వ్యాగన్ స్పందించేందుకు నిరాకరించింది. పోర్షే సైతం వోక్స్‌వ్యాగన్ సూపర్‌వైజరీ బోర్డు ప్రతిపాదించినట్లు వస్తున్న వార్తలపై స్పందించలేదు. వోక్స్‌వ్యాగన్ మాతృసంస్థగా కొన్ని చర్యలను పోర్షేకు సూచించగలదే తప్ప.. వాటిని నేరుగా అమలు చేయాలని ఆదేశించే అధికారం లేదని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ బిజినెస్ డైలీ కథనం పేర్కొంది.
తగ్గిన వోక్స్‌వ్యాగన్ మార్జిన్ అంచనా
మరోవైపు వోక్స్‌వ్యాగన్ తన వార్షిక లాభాల అంచనాను కూడా తగ్గించింది. గతంలో 4–5.5 శాతం మధ్య ఆపరేటింగ్ మార్జిన్ ఉంటుందని అంచనా వేయగా.. తాజాగా గరిష్టంగా ఒక శాతమే ఉండొచ్చని కంపెనీ తెలిపింది. పోర్షేలో చోటుచేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా సంస్థ ఆస్తుల విలువ తగ్గింపులు ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటిగా పేర్కొంటున్నారు. చైనాలో పోర్షే విక్రయాలు తగ్గడం, ఎలక్ట్రిక్ వాహనాల వ్యూహంలో మార్పులకు భారీగా ఖర్చు చేయాల్సి రావడం సంస్థకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పోర్షేను గాడిలో పెట్టేందుకు కొత్త టర్న్‌అరౌండ్ వ్యూహాన్ని రూపొందించే బాధ్యత సంస్థ సీఈవో మైఖేల్ లైటర్స్‌పై పడింది. అయితే, పోర్షేలో అదనంగా 4,100 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు వస్తున్న వార్తలకు ఇప్పటివరకు కంపెనీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | చామల, ఐలయ్యకు దమ్ముంటే సబ్స్టేషన్ల వద్ద చర్చకు రావాలి
- ●Mrunal Thakur | నాలుగేళ్ల క్రితం షూటింగ్ పూర్తి - డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ - "ఏ" సర్టిఫికెట్తో రిలీజ్
- ●Brahmotsavam 2026 | హనుమంత వాహనంపై కోదండరాముడిగా.. నేత్రపర్వంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.!
- ●Iran 7 Conditions US Talks | చర్చలా లేక భీకర యుద్ధమా?.. అమెరికాకు ఇరాన్ '7 షరతుల' అల్టిమేటం! ట్రంప్ నిర్ణయంపైనే అంతా
- ●Ponguleti Srinivas Reddy | విష ప్రచారం నమ్మకండి.. అంగుళం భూమి కూడా తీసుకోం
- ●Chamala Kirankumar Reddy | అజీజ్‌నగర్‌లోనూ ఎఫ్టీఎల్లో ఫామ్‌హౌస్ కట్టుకున్నరు

Harish Rao | చామల, ఐలయ్యకు దమ్ముంటే సబ్స్టేషన్ల వద్ద చర్చకు రావాలి

Mrunal Thakur | నాలుగేళ్ల క్రితం షూటింగ్ పూర్తి - డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ - "ఏ" సర్టిఫికెట్తో రిలీజ్

Brahmotsavam 2026 | హనుమంత వాహనంపై కోదండరాముడిగా.. నేత్రపర్వంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.!

Iran 7 Conditions US Talks | చర్చలా లేక భీకర యుద్ధమా?.. అమెరికాకు ఇరాన్ '7 షరతుల' అల్టిమేటం! ట్రంప్ నిర్ణయంపైనే అంతా





