Madhusudan Chari | తెలంగాణ తల్లి కన్న ఆణిముత్యాల్లో ఒకరు దొడ్డి కొమరయ్య: మధుసూదనా చారి
Madhusudan Chari | తెలంగాణ తల్లి కన్న ఆణిముత్యాల్లో దొడ్డి కొమరయ్య (Doddi Komuraiah) ఒకరని మండలిలో బీఆర్ఎస్ ఎల్పీ నేత మధుసూదనాచారి (Madhusudan Chari) అన్నారు.
Madhusudan Chari | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ తల్లి కన్న ఆణిముత్యాల్లో దొడ్డి కొమరయ్య (Doddi Komuraiah) ఒకరని మండలిలో బీఆర్ఎస్ ఎల్పీ నేత మధుసూదనాచారి (Madhusudan Chari) అన్నారు. ఆత్మగౌరవం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో విసునూరి రామచంద్రారెడ్డిని ఎదిరించిన గొప్ప నాయకుడని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. విసునూరి రామచంద్రారెడ్డి నాయకత్వంలో నిరంతరం పీడనకు గురవుతున్న సమయంలో ఆయన చేస్తున్న అరాచకాలను చూడలేక దొడ్డి కొమరయ్య పోరాట పటిమ మరవలేనిదన్నారు.
ఆత్మ గౌరవం కోసం ప్రాణాలను సైతం తెగించి పోరాటం చేసిన గొప్ప యోధుడని చెప్పారు. సమ్మక్క సారక్క, చాకలి ఐలమ్మ , దొడ్డి కొమరయ్య ప్రజలకు స్వేచ్ఛ వాయువులను అందించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో అన్యాయానికి గురవుతున్న తెలంగాణను చూడలేక 2001లో కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడి ఆదర్శప్రాయంగా నిలిచారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను పదేండ్ల పాటు సుస్థిరంగా ఉంచారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత దుర్ధినాలను కొనసాగిస్తుంది. అనేక హామీలు ప్రజలకు ఇచ్చి , గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ఆత్మ గౌరవంపై దెబ్బ కొడితే ఊరుకునేది లేదని తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఒక స్ఫూర్తి దినం మహానుభావుడు దొడ్డి కొమరయ్య చూపించిన మార్గంలో మనమందరం నడుచుకోవాలి. దొడ్డి కొమరయ్య నుంచి మనమందరం స్ఫూర్తి పొంది ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



