త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana IPS Promotions | ఆరుగురు సీనియర్ ఐపీఎస్‌లకు డీజీలుగా ప్రమోషన్.. సజ్జనార్, మహేష్ భగవత్‌లకు పదోన్నతి!

తెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీ (DG) హోదా దక్కింది. 1995, 1996 బ్యాచ్‌కు చెందిన వీసీ సజ్జనార్, మహేష్ భగవత్, స్వాతి లక్రా సహా ఆరుగురు అధికారులు అడిషనల్ డీజీ నుంచి డీజీలుగా పదోన్నతి పొందారు. కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

J

Telangana | Published On Apr 22, 2026, 6.48 pm IST

Telangana IPS Promotions | ఆరుగురు సీనియర్ ఐపీఎస్‌లకు డీజీలుగా ప్రమోషన్.. సజ్జనార్, మహేష్ భగవత్‌లకు పదోన్నతి!
Advertisement

Telangana IPS promotions | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ (IPS) అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు (Promotions) కల్పించింది. ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (అడిషనల్ డీజీ - Addl. DG) హోదాలో విధులు నిర్వర్తిస్తున్న ఆరుగురు ఐపీఎస్ అధికారులను డైరెక్టర్ జనరల్ (డీజీ - DG) హోదాకు ప్రమోట్ చేసింది.

పదోన్నతి పొందినది వీరే..

ప్రభుత్వం డీజీలుగా పదోన్నతి కల్పించిన వారిలో 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న వీసీ సజ్జనార్, మహేష్ భగవత్, స్వాతి లక్రా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. డీజీ ర్యాంక్‌కు ప్రమోషన్ పొందిన ఆరుగురు అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి:

  • వీవీ శ్రీనివాస్ రావు (1995 బ్యాచ్)
  • స్వాతి లక్రా (1995 బ్యాచ్)
  • మహేష్ భగవత్ (1995 బ్యాచ్)
  • చారుసిన్హా (1996 బ్యాచ్)
  • డాక్టర్ అనిల్ కుమార్ (1996 బ్యాచ్)
  • వీసీ సజ్జనార్ (1996 బ్యాచ్)

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మహిళా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తదితర కీలక విభాగాల్లో ఈ అధికారులు తమదైన ముద్ర వేశారు. అడిషనల్ డీజీలుగా ఉత్తమ సేవలు అందించిన వీరికి హోదా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించిన ఫైల్‌ను ఉన్నతాధికారులు క్లియర్ చేయడంతో, రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ (GAD) నుండి అధికారిక ఉత్తర్వులు (GO) మరికాసేపట్లో వెలువడనున్నట్లు సమాచారం. డీజీలుగా పదోన్నతి పొందిన ఈ అధికారులకు ఏయే విభాగాల బాధ్యతలు అప్పగిస్తారు అనేది ఈ ఉత్తర్వులు వెలువడిన తర్వాత స్పష్టత రానుంది.

Advertisement
Advertisement