త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sajjanar | గ్యాస్ సిలిండ‌ర్ల‌లో అక్ర‌మాలు.. వెలుగులోకి తెచ్చిన తండ్రీకొడుకుల‌కు స‌న్మానించిన సీపీ

P

Hyderabad | Published On May 2, 2026, 9.00 pm IST

CP Sajjanar | గ్యాస్ సిలిండ‌ర్ల‌లో అక్ర‌మాలు.. వెలుగులోకి తెచ్చిన తండ్రీకొడుకుల‌కు స‌న్మానించిన సీపీ
Advertisement

CP Sajjanar | గ్యాస్ సిలిండర్లలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చిన తండ్రీకొడుకులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అభినందించారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో శనివారం జరిగిన కార్యక్రమంలో వారికి ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారం అందజేశారు. చూడిబజార్‌కు చెందిన వ్యాపారి అశోక్ తివారీ, ఆయన కుమారుడు నమాన్ తివారీ గ్యాస్ డెలివరీలో బరువు తక్కువగా ఉందని గుర్తించి ఆరా తీశారు. గతంలోనూ ఇదే పరిస్థితి ఎదురుకావడంతో అనుమానం పెరిగింది. నిబంధనల ప్రకారం 30.4 కిలోలు ఉండాల్సిన సిలిండర్ కేవలం 28 కిలోలుగా ఉన్నట్లు తేలింది.

ఆరా తీయ‌గా.. సిద్ధార్థ ఎంటర్‌ప్రైజెస్ ఏజెన్సీ ఉద్యోగులు జుమేరాత్ బజార్‌లోని ఓ ఇంట్లో అక్రమంగా సిలిండర్ల రీఫిల్లింగ్ చేస్తున్నట్లు బయటపడింది. దీంతో గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సిలిండర్లు, రీఫిల్లింగ్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా సీపీ మాట్లాడుతూ పౌరులు బాధ్య‌త‌తో వ్యవహరించి అక్రమాలను బయటపెట్టిన తండ్రీకొడుకులు అందరికీ ఆద‌ర్శ‌నీయ‌మ‌ని.. ఇలాంటి చైతన్యం ఉంటేనే నేరరహిత సమాజం సాధ్యమ‌ని పేర్కొన్నారు. అక్రమ గ్యాస్ ఫిల్లింగ్‌పై కఠిన చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో గోల్కొండ జోన్ డీసీపీ చంద్ర మోహన్, గోషామహాల్ ఎస్‌హెచ్ఓ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement