త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mancherial | లక్షెట్టిపేటలో ఈదురుగాలి బీభ‌త్సం.. తండ్రీకొడుకులు స‌హా న‌లుగురు దుర్మ‌ర‌ణం

Mancherial | మంచిర్యాల (Mancherial) జిల్లా ల‌క్షెట్టిపేట మండ‌లంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న‌ది. మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులు (Strong Winds) బీభత్సం సృష్టించాయి. ప్రకృతి ప్రకోపానికి రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మ‌తిచెందారు. మృతుల్లో తండ్రీకొడుకులు కూడా ఉన్నారు.

G

Telangana | Published On May 6, 2026, 9.03 am IST

Mancherial | లక్షెట్టిపేటలో ఈదురుగాలి బీభ‌త్సం.. తండ్రీకొడుకులు స‌హా న‌లుగురు దుర్మ‌ర‌ణం
Advertisement

Mancherial | త్రినేత్ర‌.న్యూస్‌: మంచిర్యాల (Mancherial) జిల్లా ల‌క్షెట్టిపేట మండ‌లంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న‌ది. మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులు (Strong Winds) బీభత్సం సృష్టించాయి. ప్రకృతి ప్రకోపానికి రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మ‌తిచెందారు. మృతుల్లో తండ్రీకొడుకులు కూడా ఉన్నారు.

లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం (ఐకేపీ సెంటర్) వద్ద రైతులు ఉన్నారు. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఒక్క‌సారిగా ఈదురుగాలులు ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో రక్షణ కోసం సమీపంలో ఉన్న ఒక గోడ పక్కన నిల్చున్నారు. అదే సమయంలో దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన నీలికి లచ్చన్న (55) అనే వ్యక్తి తన కుమారుడిని హైదరాబాద్ బస్సు ఎక్కించేందుకు లక్షెట్టిపేటకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో గాలి వాన మొదలవ్వడంతో, ఆయన కూడా కొత్తూరు కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకుని ఆ గోడ చెంతనే ఆశ్రయం పొందారు.

దురదృష్టవశాత్తూ, గాలి తీవ్రతకు ఆ గోడ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడున్న వారిపై పడిపోయింది. దీంతో నీలికి లచ్చన్నతో పాటు, గుండారపు వెంకటేశ్‌ (40) అనే రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ద‌వాఖాన‌కు త‌ర‌లించారు.

మ‌రో ఘ‌ట‌న‌లో గంప‌ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు త‌నువుల నాగ‌రాజు (44), అభిరామ్ (22) స్థానిక కొనుగోలు కేంద్రంలో ఆర‌బోసిన ధాన్యంపై టార్పాలిన్ క‌ప్పేందుకు వెళ్లారు. గాలి బీభ‌త్సం సృష్టిస్తుండ‌టంతో ప‌క్క‌నే ఉన్న రేకుల షెడ్డులోకి వెళ్లారు. అయితే గాలి తీవ్ర‌త‌కు అది ఒక్క‌సారిగా కూలిపోయింది. దీంతో అభిరామ్ అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా, నాగ‌రాజు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స్థానికులు ఆయ‌న‌ను క‌రీంన‌గ‌ర్‌లోని ఓ ప్రైవేటు ద‌వాఖ‌న‌కు త‌ర‌లించ‌గా అక్క‌డ చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. దీంతో రెండు గ్రామాల్లో విషాద ఛాయ‌లు అల‌ముకున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

 

Advertisement
Advertisement