Heatstroke | రాష్ట్రంపై భానుడి పంజా.. వడదెబ్బతో 34 మంది మృతి
Heatstroke | రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు కూడా దాటాయి. అధిక ఉష్ణోగ్రతలకు వడగాల్పులు (Heatwave) తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రోగులు ఎండలకు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు.
Heatstroke | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు కూడా దాటాయి. అధిక ఉష్ణోగ్రతలకు వడగాల్పులు (Heatwave) తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రోగులు ఎండలకు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా వడదెబ్బతో (Heatstroke) శుక్రవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 34 మంది మృతిచెందారు. మృతుల్లో వేసవి సెలవుల్లో నానమ్మతో గడిపేందుకు సొంతూరికి వచ్చిన 8 ఏండ్ల చిన్నారి కూడా ఉన్నారు.
- ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ (27), నేరడిగొండ మండలం బోరిగాంలో జాదవ్ లతాబాయి (54), తలమడుగు మండలం కుచులాపూర్‌లో వ్యవసాయ కూలీ ఆత్రం రాము(44), నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం దర్యాపూర్‌లో రాజేశ్వర్ (52), కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన ఆరెల్లి పరశురాములు(62), జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో తాపీమేస్త్రీ శ్రీనివాస్(40), మోరపల్లిలో కర్నె లచ్చయ్య (85), పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన రామినేని మల్లయ్య(75), రామగుండంలో అబ్బాస్‌ఖాన్(53) ప్రాణాలు కోల్పోయారు.
- వరంగల్ జిల్లా ఖిలావరంగల్ పడమరకోటకు చెందిన బండి హరిశంకర్ (58), నల్లబెల్లి మండలం ఆసరవెల్లిలో గుగులోతు నరసింహ (55), హనుమకొండ జిల్లా కాజీపేటలో వి.వెంకటేశ్ (26), జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ విలీన గ్రామం ఆకుదారివాడలో దుర్గం సమ్మక్క(59), కాటారం మండలం మేడిపల్లిలో జెల్ల లస్మయ్య(60), శంకరాంపల్లిలో గాదె సమ్మక్క(65) ఎండ వేడికి తట్టుకోలేక మరణించారు.
- మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తహసీల్దార్ బంజారాలో నన్నెబోయిన సత్యం(71), గూడూరు మండలం మచ్చర్లలో కొట్టెం భద్రమ్మ (60) మరణించారు.
- నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జి.శాంతమ్మ(75), నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో కృష్ణయ్య(45), యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సుంచు శ్రీనివాస్(58), సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం ముక్కుడుదేవిపల్లిలో దాసరి భిక్షం(65) మృతిచెందారు.
- ఖమ్మంలో పెనుగొండ వెంకన్న (56), చేకూరి నాగయ్య(55), యార్లగడ్డ గోవర్ధన్‌రావు (70), ముస్తఫానగర్‌కు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ షేక్ సలీమ్ (45), కూసుమంచి మండలం మంగలితండాలో బాదావత్ రాములు (76), తేజావత్ కేస్లీ (85), కొణిజర్లకు చెందిన పాముల శ్రీను (53), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలేంలో మండ గోపయ్య (75), పినపాక మండలం బోటిగూడెంలో మల్లమ్మ (50), చినరాజుపేటకు చెందిన యేసు (40), గుండాల మండలం లింగగూడెం గ్రామానికి చెందిన జనగం రాంబాబు (42), చర్ల మండలం దానవాయిపేటలో దాగం సీతమ్మ(65) మృతిచెందారు.

- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగన్‌పల్లి గ్రామానికి చెందిన గైని సంజీవ్, కవిత దంపతులు కొన్నేండ్లుగా హైదరాబాద్ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కుమార్తె కీర్తన (8) ఎండాకాలం సెలవుల్లో నానమ్మతో గడిపేందుకు సొంతూరికి వచ్చింది. నాలుగు రోజులుగా తోటి పిల్లలతో కలిసి ఆరుబయట ఆడుకుంటున్నది. నీరసం, జ్వరం రావడంతో దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మరణించింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ranveer Singh | బ్యాన్ వేళ కర్ణాటకలోని చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ పూజలు - మరో వివాదానికి పుల్‌స్టాప్!
- ●Harish Rao | కొడంగల్ లంబాడీ బిడ్డలే రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి కడుతారు : హరీశ్‌రావు
- ●Pregnant Women | గర్భిణీలకు అలర్ట్.. థైరాయిడ్ ను నిర్లక్ష్యం చేస్తే పిల్లలకు ఏఎస్డీ ప్రమాదం..
- ●Devi Prasad | ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై చర్యలు నిలిపివేయాలి: దేవీప్రసాద్ డిమాండ్
- ●Deepak Bagla | భారతీయులు అందుకనే సీఈవోలుగా పనిచేస్తున్నారు: నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా
- ●Chhattisgarh | "రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి".. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న లేఖ

Ranveer Singh | బ్యాన్ వేళ కర్ణాటకలోని చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ పూజలు - మరో వివాదానికి పుల్‌స్టాప్!

Harish Rao | కొడంగల్ లంబాడీ బిడ్డలే రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి కడుతారు : హరీశ్‌రావు

Pregnant Women | గర్భిణీలకు అలర్ట్.. థైరాయిడ్ ను నిర్లక్ష్యం చేస్తే పిల్లలకు ఏఎస్డీ ప్రమాదం..

Devi Prasad | ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై చర్యలు నిలిపివేయాలి: దేవీప్రసాద్ డిమాండ్





