Mallu Bhatti Vikramarka | విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు – డీఏ పెంపుపై డిప్యూటీ సీఏం ఆమోదం
విద్యుత్ శాఖ ఉద్యోగుల డీఏ పెంపుపై తెలంగాణ డిప్యూటీ సీఏం ఆమోదముద్ర వేశారు. 17.651 డీఏను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా 71 వేలకు మందికిపైగా ఉద్యోగులు లబ్ది పొందనున్నారు.
Mallu Bhatti Vikramarka | విద్యుత్ శాఖ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. 17.651 శాతం డియర్ నెస్ అలవెన్స్ (DA) ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది విద్యుత్ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. బహిరంగ మార్కెట్ లో పెరుగుతున్న ధరల సూచి ఆధారంగా ప్రతి ఏడాది జనవరి, జులై నెలల్లో డియర్ నెస్ అలవెన్స్ (DA)/డియర్ నెస్ రిలీఫ్ (DR) ను సమీక్షిస్తూ విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది జూలై 1నంచి నుంచి అమలయ్యేలా ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డిఎ/డిఆర్ ను 17.651 శాతంగా ఖరారు చేశారు.
ప్రభుత్వ ఉత్తర్వులతో విద్యుత్ సంస్థల పరిధిలోని 71,387 వేల మంది ఉద్యోగులు, ఆర్టిజెన్లు, పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. పెరిగిన డీఏ ప్రకారం టీజీ ట్రాన్స్ కోలో 3,036 మంది ఉద్యోగులకు, 3,769 మంది ఆర్టిజన్లకు, 2,446 మంది పెన్షనర్లకు మొత్తంగా 9,251 మందికి ప్రయోజనం చేకూరనుంది. జెన్ కో విషయానికి వస్తే 6,913 మంది ఉద్యోగులకు 3,583 మంది ఆర్టిజన్లకు, 3,579 మంది పెన్షనర్లు లాభపడనున్నారు. ఎస్పీడీసీఎల్ లో 11,957 మంది ఉద్యోగులకు 8,244 మంది ఆర్టిజన్లకు, 8,244 మంది పెన్షనర్ల లబ్ధి చేకూరనుంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో 9,728 మంది ఉద్యోగులకు 3,465 మంది ఆర్టిజన్లకు, 6,115 మంది పెన్షనర్లకు లాభపడనున్నారు. పెరిగిన డీఏ కారణంగా విద్యుత్ సంస్థలపై ప్రతి నెలా 9.39 కోట్ల అదనపు భారం పడనుంది.
సంబంధిత వార్తలు

Telangana Vidyut Artisans | విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలపై కదలిక: డిప్యూటీ సీఎం భట్టితో భేటీ.. సీఎండీలతో చర్చలకు గ్రీన్ సిగ్నల్
మే 6, 2026

Kolly Kishore Babu | రేవంత్ గారూ.. వ్యవసాయం మానేయాల్సి వస్తదేమో.. ఓ రైతు లేఖ ఇదీ..
ఏప్రిల్ 20, 2026

DA Hike | ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం.. డీఏ 2 శాతం పెంపు
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



