త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Original Sead at Jayashankar University | రైతుల‌కు అందుబాటులో 1,231 ట‌న్నుల విత్త‌నాలు: జయశంకర్ వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య

Original Sead at Jayashankar University | రాష్ట్రంలో అన్ని పంటలకు సంబంధించిన సుమారు 1,231 టన్నుల విత్తనాలను సుమారు 1,50,000 మంది రైతులకు 27 యూనివర్సిటీల‌ అమ్మక కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచామని జయశంకర్ వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య (Aldas Janaiah) తెలిపారు. అగ్రివర్సిటీ ఈనెల 23 నుండి 30 వరకు "విత్తన వారోత్సవాలు" నిర్వహిస్తున్న‌ట్లు చెప్పారు.

S

Telangana | Published On May 16, 2026, 5.40 pm IST

Original Sead at Jayashankar University | రైతుల‌కు అందుబాటులో 1,231 ట‌న్నుల విత్త‌నాలు: జయశంకర్ వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య
Advertisement
  • 23 నుంచి జయశంకర్ వర్సిటీ విత్తన వారోత్సవాలు
  • లక్షా యాభై వేల మంది రైతులకు స‌రిప‌డా నాణ్యమైన విత్తనాలున్నాయి
  • ఈనెల‌ 18 నుండి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి
  • రైతుల‌కు ఉపకులపతి ప్రొ. అల్దాస్ జానయ్య పిలుపు

Original Sead at Jayashankar University | త్రినేత్ర‌.న్యూస్: రాష్ట్రంలో అన్ని పంటలకు సంబంధించిన సుమారు 1,231 టన్నుల విత్తనాలను సుమారు 1,50,000 మంది రైతులకు 27 యూనివర్సిటీల‌ అమ్మక కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచామని జయశంకర్ వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య (Aldas Janaiah) తెలిపారు. ఈ మూల విత్తనం ద్వారా వచ్చే దిగుబడిని మ‌ళ్లీ వచ్చే మూడు సంవత్సరాలు విత్తనంగా వాడుకునే అవకాశం ఉంటుంద‌న్నారు. “99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" లో భాగంగా అగ్రివర్సిటీ ఈనెల 23 నుండి 30 వరకు "విత్తన వారోత్సవాలు" నిర్వహిస్తున్న‌ట్లు చెప్పారు. వివిధ జిల్లాల్లో వివిధ పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నదని పేర్కొన్నారు.

మొత్తం రాష్ట్రంలోని విత్తన అవసరాలలో ఇది కేవలం ఒక శాతమే. అయిన‌ప్ప‌టికీ ప్రస్తుతం మార్కెట్లో కొన్ని నకిలి విత్తన కంపెనీలు రైతాంగానికి పదేపదే మోసం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయం నాణ్యమైన విత్తనోత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చి ప్రతి గ్రామాన్ని విత్తనం స్వయం సమృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రతి రైతుకు ఆయా పంటకు సంబంధించి రెండు మూల విత్తన కిట్లు (2 ఎకరాలకు సరిపోయే విత్తనం) మాత్రమే విక్ర‌యిస్తారు. విశ్వవిద్యాలయంలో ఉన్న మూల విత్తనం ప‌రిమితంగా ఉండ‌డం వ‌ల్ల ఈనెల 18 నుండి 22 వరకు ఆయా జిల్లాల రైతులు అమ్మక కేంద్రాలలో ముందుగానే బుకింగ్ చేసుకొనేలా ఏర్పాట్లు చేశాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

23 నుంచి మిగిలిన విత్త‌నాలు కొనుక్కోండి..

రైతుల‌కు పంపిణీ చేయగా మిగిలిన విత్తనాల‌ను ఆయా కేంద్రాలలో ఈనెల‌ 23 నుండి ఇతర రైతులు కొనుగోలు చేసుకోవాలి. ప్రతి రైతు సంబంధిత అమ్మక కేంద్రాల నుండి విత్తనం కొనుగోలు చేసేటప్పుడు విశ్వవిద్యాలయ అధికారిక రశీదుతో పాటు సంబంధిత సాంకేతిక పత్రాన్ని విధిగా ఆయా శాస్త్రవేత్తల నుండి పొందాలి అని ఉప‌కుల‌ప‌తి జాన‌య్య‌ కోరారు.

భారత ప్రభుత్వం 1979లో ప్రారంభించిన జాతీయ విత్తన పథకం (నేషనల్ సీడ్ ప్రాజెక్ట్)లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 1979 నుండి కీలక భాగస్వామిగా పనిచేస్తుంది. ఈ పథకం కింద వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల నుండి ముందస్తుగా వచ్చే విత్తన ఇండెంట్ల ప్రకారం వివిధ పంటల బ్రీడర్ సీడ్ను ఉత్పత్తి చేసి ఆయా సంస్థలకు నిరంతరం సరఫరా చేస్తుంది. దీనితో పాటు వివిధ పంటల నాణ్యమైన మూల విత్తనాన్ని (ఫౌండేషన్ సీడ్) విశ్వవిద్యాలయం వివిధ పరిశోధనా కేంద్రాలతో పాటు రైతు విజ్ఞాన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లోని క్షేత్రాలలో శాస్త్రవేత్తల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్పత్తి చేసి పరిమిత పరిమాణంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల రైతాంగానికి గత ఐదు దశాబ్దాల నుండి సరఫరా చేస్తూ వస్తున్నది అని జాన‌య్య పేర్కొన్నారు.

 

 

Advertisement
Advertisement