Free Bus Scheme | ఉచిత ప్రయాణం.. మహిళలకు రూ. 10 వేల కోట్లు ఆదా
Free Bus Scheme | కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ పథకం అమలు వల్ల నేటితో మహిళలకు రూ. 10 వేల కోట్లు ఆదా అయ్యాయని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు.
Free Bus Scheme | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ పథకం అమలు వల్ల నేటితో మహిళలకు రూ. 10 వేల కోట్లు ఆదా అయ్యాయని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. 2023 డిసెంబర్ 9న పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 28 నెలల కాలంలోరాష్ట్రవ్యాప్తంగా దాదాపు 290 కోట్లకు పైగా జీరో టికెట్లను మహిళా ప్రయాణికులు వినియోగించుకున్నట్లు తెలిపారు. గతంలో రవాణా ఛార్జీల కోసం నెలకు సగటున రూ. 1,500 నుండి రూ. 2,500 వరకు వెచ్చించే సామాన్య, మధ్యతరగతి మహిళలు, విద్యార్థినులు, కూలీలు ఇప్పుడు ఆ మొత్తాన్ని పొదుపు చేసుకుంటున్నారని, ఈ పొదుపు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా రూ. 10,000 కోట్లకు చేరడం మహిళల ఆర్థిక స్వావలంబనకు నిదర్శనంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
మహిళలకు “స్మార్ట్ కార్డులు’’
మహాలక్ష్మి పథకాన్ని మరింత సరళతరం చేసేందుకు, కచ్చితమైన గణాంకాల కోసం త్వరలో చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్పారు. ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్ కార్డులు ద్వారా మహిళల ఉచిత ప్రయాణం చేసేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడనుందని, పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను ప్రవేశపెట్టడం జరుగుతోందని ఎండీ స్ఫష్టం చేశారు. ఈ పథకం పల్లెవెలుగు (3278), డిస్ట్రిక్ట్ ఎక్స్ప్రెస్ (2039), సిటీ ఆర్డినరీ (1829) మరియు సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ (1044) బస్సులలోని మొత్తం బస్సులలో 81 శాతం వర్తిస్తుందని వివరించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



