ADG Vijay Kumar | లైసెన్స్ లేని సెక్యూరిటీ ఏజెన్సీలపై కఠిన చర్యలు: ఏడీజీ విజయ్ కుమార్
ADG Vijay Kumar | తెలంగాణలో చెల్లుబాటు అయ్యే పీఎస్‌ఏఆర్‌ఏ (PSARA) లైసెన్స్ లేకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ అథారిటీ నియంత్రణాధికారి విజయ్ కుమార్ హెచ్చరించారు.
ADG Vijay Kumar | తెలంగాణలో చెల్లుబాటు అయ్యే పీఎస్‌ఏఆర్‌ఏ (PSARA) లైసెన్స్ లేకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ అథారిటీ నియంత్రణాధికారి విజయ్ కుమార్ హెచ్చరించారు. లక్డీకాపూల్‌లోని ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల యజమానులు, అసోసియేషన్ ప్రతినిధులు, ఇంటెలిజెన్స్ మరియు కార్మిక శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పీఎస్‌ఏఆర్‌ఏ-2005 చట్టం, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి సెక్యూరిటీ ఏజెన్సీకి లైసెన్స్ తప్పనిసరని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సెక్యూరిటీ గార్డుల నియామకంలో పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా నిర్వహించాలని, 21 రోజుల ప్రాథమిక శిక్షణ పూర్తిచేసిన వారినే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల కొందరు సెక్యూరిటీ సిబ్బంది నేరాల్లో పాల్గొన్న ఘటనల నేపథ్యంలో ఈ సూచనలు చేసినట్లు తెలిపారు. గార్డులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు, ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని, కార్మిక నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులు సూచించారు. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది స్థానిక పోలీసులకు సహకరిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని విజయ్ కుమార్ కోరారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు లైసెన్సింగ్, పునరుద్ధరణ, ఆన్‌లైన్ పోర్టల్ తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. చట్టబద్ధంగా పనిచేసే సెక్యూరిటీ ఏజెన్సీలకు ప్రభుత్వ శాఖల నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Irrigation Projects | ప్రాజెక్టులకు పూర్వ వైభవం.. జలాశయాల్లో డీసిల్టేషన్పై మంత్రి ఉత్తమ్ ఫోకస్, అధికారులకు కీలక ఆదేశాలు
- ●Hyderabad Metro Rail Takeover | హైదరాబాద్ మెట్రో టేకోవర్‌లో భారీ స్కామ్.. జపాన్ లోన్ వివరాలేవి? రేవంత్‌కు దాసోజు శ్రవణ్ సూటి ప్రశ్నలు
- ●Minister Vakiti Srihari | చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ
- ●Samantha meets TN CM Vijay | తమిళనాడు సీఎం విజయ్ను కలిసిన సమంత.. 'ఆయన రియల్ హీరో' అంటూ ఎమోషనల్ పోస్ట్!
- ●Trump Road | హైదరాబాద్‌లో కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టొద్దు : లెఫ్ట్ పార్టీలు
- ●TG High Court | ఆ ఐదెకరాల భూమి మాదే.. తెలంగాణ ప్రభుత్వంపై కోర్టుకెక్కిన హైకోర్టు..!

Telangana Irrigation Projects | ప్రాజెక్టులకు పూర్వ వైభవం.. జలాశయాల్లో డీసిల్టేషన్పై మంత్రి ఉత్తమ్ ఫోకస్, అధికారులకు కీలక ఆదేశాలు

Hyderabad Metro Rail Takeover | హైదరాబాద్ మెట్రో టేకోవర్‌లో భారీ స్కామ్.. జపాన్ లోన్ వివరాలేవి? రేవంత్‌కు దాసోజు శ్రవణ్ సూటి ప్రశ్నలు

Minister Vakiti Srihari | చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ

Samantha meets TN CM Vijay | తమిళనాడు సీఎం విజయ్ను కలిసిన సమంత.. 'ఆయన రియల్ హీరో' అంటూ ఎమోషనల్ పోస్ట్!




